»   » ఆమె లేకుండానే ప్రభాస్.. ఇంకా ఖరారు కానీ వ్యవహారం.. గుట్టుచప్పుడుగా..

ఆమె లేకుండానే ప్రభాస్.. ఇంకా ఖరారు కానీ వ్యవహారం.. గుట్టుచప్పుడుగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలితో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్న ప్రభాస్ తన తదుపరి సినిమాను ఫుల్ జోష్‌తో ప్రారంభించాడు. మిర్చి ఘన విజయం తర్వాత ప్రభాస్ ఐదేళ్లపాటు పూర్తిగా బాహుబలికే అంకితమయ్యాడు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాలకు పూర్తిగా అంకితమయ్యాడు. బాహుబలి షూటింగ్ సమయంలో భారీగా అవకాశాలు తలుపుతట్టాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేశాయి. అయినా బాహుబలి సినిమా తన జీవితంలో ఎంత ముఖ్యమైందో అనే విషయాన్ని గ్రహించి.. పలు ఆఫర్లను తిరస్కరించినట్టు సమాచారం. ప్రస్తుతం హోం ప్రొడక్షన్ యూవీ క్రియేషన్‌లో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.

హడావిడి లేకుండా

హడావిడి లేకుండా

బాహుబలి చిత్రం తర్వాత హాలీడేకు వెళ్లిన ప్రభాస్ ఇటీవలే హైదారబాద్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత తన సాహో సినిమాను ఎలాంటి ఆర్బాటం లేకుండా సింపుల్‌గా ప్రారంభిచేశాడు. సాహోకు సంబంధించి ఇంకా హీరోయిన్‌ ఎంపిక ఫైనల్ కాకపోవడంతో మిగితా నటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్‌లపై..

ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్‌లపై..

సాహో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలోని కొన్ని కీలక ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ లైబ్రరీ తదితర ప్రాంతాల్లో రెండు రోజులుగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తున్నది. ఈ షూటింగ్‌లో ప్రభాస్‌తోపాటు విలన్ నీల్ నితిన్ ముఖేష్ తదితరులు పాల్గొన్నట్టు తెలుస్తున్నది.

 భారీ బడ్జెట్‌తో..

భారీ బడ్జెట్‌తో..

రన్ రాజా రన్ ఫేం సుజిత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ సినిమా ప్రమాణాలకు అనుగుణంగా రూ.150 కోట్ల బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో వుండాలని ఈ సినిమాపై ప్రభాస్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. హాలీవుడ్‌కు చెందిన పలువురు టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

ప్రభాస్ రేంజ్‌కు తగినట్టుగా..

ప్రభాస్ రేంజ్‌కు తగినట్టుగా..

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ నేషనల్ స్థాయికి చేరుకోవడం ద్వారా ఈ సినిమాను హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. జాతీయ స్థాయికి తగినట్టుగా బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కత్రినా కైఫ్, దిశ పటానీ, శ్రద్ధా కపూర్ ను సంప్రదించారు. అయితే బాలీవుడ్ హీరోయిన్లు తమ స్థాయికి మించి రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ ప్రయత్నాలను మానుకొన్నారు.

అనుష్క కన్ఫర్మ్..

అనుష్క కన్ఫర్మ్..

తాజాగా సాహోలో హీరోయిన్‌గా అనుష్క కన్ఫర్మ్ అయినట్టు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. బిల్లా, మిర్చి చిత్రాల్లో ప్రభాస్, అనుష్క కెమిస్ట్రీ అదరగొట్టింది. బాహుబలి రెండు పార్టుల్లోను ఈ క్రేజీ జంట ఇరగదీసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు అనుష్కనే సరైన జోడని మాట వినిపిస్తున్నది. అనుష్క ఈ చిత్రంలో నటించే విషయంపై ఇంకా ఎటూ తేల్చలేదని తాజా సమాచారం.

రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

బాహుబలి2 స‌ృష్టించిన కలెక్షన్ల హంగామాతో సాహో చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమా ప్రారంభానికి ముందే ప్రీ రిలీజ్ ఆఫర్లు రికార్డు స్థాయిలో వచ్చినట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు సాహో ప్రాజెక్ట్‌ను తమకు అప్పగించాలని నిర్మాతలను కోరాయట. దాదాపు మూడు వందల కోట్ల మేర ఆఫర్‌ను కూడా ప్రకటించాయనేది తాజా సమాచారం.

పెళ్లి వార్తలపై అనుష్క మనస్తాపం..

పెళ్లి వార్తలపై అనుష్క మనస్తాపం..

ఇదిలా ఉండగా, బాహుబలి2 విడుదల తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి గురించి రూమర్లు తెగ ప్రచారం జరుగుతున్నాయి. ఓ దశలో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో హడావిడి చేసింది. ఈ వార్తలపై అనుష్క మనస్తాపానికి గురైందనే విషయం బయటికి వచ్చింది. అంతేకాకుండా తన పెళ్లి గురించి తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమని చెప్పినట్టు తెలిసింది. కాగా, ప్రభాస్ వివాహం ప్రముఖ పారిశ్రామిక వేత్త మనవరాలితో నిశ్చయం కానున్నదని, అనుష్క పెళ్లి కూడా మరో వ్యక్తితో కుదిరే అవకాశం ఉందనే గాసిప్స్ కొత్తగా ప్రచారంలోకి వచ్చాయి.

English summary
After Baahubali, Prabhas's Saaho movie started shooting in Hyderabad. Few scenes are shooted on Prabhas, Neil Nitin Mukhesh and others recently. For this movie, still heroine selection is not finalised.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu