»   » ప్రభాస్ సినిమానే సుధీర్ బాబు కలిసివచ్చేటట్లుంది, అందుకే కన్నీళ్లు

ప్రభాస్ సినిమానే సుధీర్ బాబు కలిసివచ్చేటట్లుంది, అందుకే కన్నీళ్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'SMS' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తరువాత 'ప్రేమ కథా చిత్రమ్' సినిమాతో మంచి సక్సెస్ సాధించాడని కానీ ఆ స్ధాయిలో ఒక్క సినిమా కూడా పడలేదు. ఎంతో ఆశలు పెట్టుకుని చేసిన 'భలే మంచి రోజు' చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఆడింది.

అయితే ఇలాంటి సమయంలో ఆయన కెరీర్ కు ఊపొచ్చే ట్రైలర్ విడుదలైంది. అయితే అది తెలుగు సినిమాది కాదు. ప్రభాస్ సూపర్ హిట్ వర్షం రీమేక్ గా రూపొందుతున్న 'భాఘీ' చిత్రం ట్రైలర్.

ఈ ట్రైలర్ విడుదలై ఇప్పుడు అందరి ప్రశంసలూ పొందుతోంది. ఈ విషయం సుధీర్ బాబుకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ విషయమై ఆయన చేసిన ట్వీట్ చూడండి.

'ఎక్కడో బాలీవుడ్ లో ఓ ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఓ తెలుగువాడిని తీసుకుపోయారు. మనం ఎవరికీ తక్కువ కాదు'' అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది.

జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న 'భాఘీ' సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు సుధీర్ బాబు. తెలుగులో గోపిచంద్ చేసిన పాత్ర అది. హీరోకు పోటిగా ఉండే పవర్ ఫుల్ క్యారెక్టర్ కావటంతో నెగెటివ్ రోల్ అయినా సరే చేయడానికి అంగీకరించాడు సుధీర్.

Prabhas's Varsham Hindi remake trailer released

బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని మ్యాన్లీ ఫిజిక్ తో ఆకట్టుకోవటమే ఈ సినిమా సుధీర్ వద్దకు రావటానికి కారణమైంది. సుధీర్ బాబు 'భాఘీ' సినిమాతో నార్త్ ఆడియన్స్ కు కూడా దగ్గరవ్వాలని భావిస్తున్నాడు.

సుధీర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'భాగి' ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కోసం సుధీర్ ఎంతో కష్టపడి.. కండలు పెంచాడు. సుధీర్ కష్టం ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తోంది.

English summary
Theatrical Trailer of 'Baaghi', Varsham Hindi remake released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu