»   » ప్రభాస్ కి నచ్చింది, అందుకే షేర్ చేసాడు

ప్రభాస్ కి నచ్చింది, అందుకే షేర్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శర్వానంద్‌, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా'. ఈ సినిమాకి సంభందించి ప్రభాస్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓపోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ లో ఈ చిత్రం ట్రైలర్ ని కలుపుతూ...హీరో శర్వానంద్‌, నిర్మాతలు ప్రమోద్, వంశీ, గాంధీకి శుభాకాంక్షలు చెప్పాడు.

ప్రభాస్... పేరు వింటేనే అభిమానులకి ఉత్సాహం పెరుగుతుంది. ఆలాంటిది ఆతను బాగుంది అని చెబితే చూడకుండా ఉండగలరా, అందుకు ఓ లుక్ ఇక్కడ వేయండి ప్రభాస్ ఎందుకిలా అన్నాడో అర్థమవుతుంది.


Very entertaining trailer.... Best wishes to Pramod, Vamsi, Sharwaa and Gandhi for Express Raja.


Posted by Prabhas on Sunday, December 20, 2015

'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్ర ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ప్రవీణ్‌ లక్కరాజు సంగీత మందించిన పాటల సిడీలను అతిథిగా విచ్చేసిన హీరో ప్రభాస్‌ ఆవిష్కరించి తొలి కాపీని నిర్మాత దిల్‌రాజుకు అందించారు.


ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ, 'సినిమా హిట్‌ కావాలంటే కథ, డైరెక్టరే ముఖ్యం. మేర్లపాక గాంధీ క్లారిటీ ఉన్న దర్శకుడు. ప్రవీణ్‌ మంచి మ్యూజిక్‌ అందించారు. 'కలర్‌ ఫుల్‌ చిలుక' పాట అందరికీ బాగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని సూపర్‌ హిట్‌ చేయండి' అని అన్నారు.


''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. బ్రహ్మాజీ ద్వారా శర్వానంద్‌ని కలిసి కథ చెప్పాను. శర్వానంద్‌ను డైరెక్ట్‌ చేయడమంటే బెంజ్‌కారును డ్రైవ్‌ చేయడం లాంటిది. చాలాస్మూత్‌గా, కూల్‌గా ఉంటారు. యు.వి.క్రియేషన్‌ వంటి మంచి బ్యానర్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది' అని దర్శకుడు తెలిపారు.


శర్వానంద్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమాకు కథే హీరో. సినిమాలో ప్రతి పాత్ర కీలకమైనదే. యు.వి.క్రియేషన్‌ నా సొంత సంస్థ లాంటిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను' అని చెప్పారు.


దిల్‌రాజు మాట్లాడుతూ, 'ఈ చిత్ర నిర్మాతలు గొప్ప సినిమాలను నిర్మిస్తున్నారు. యు.వి.క్రియేషన్‌ అంటే ప్రభాస్‌కిది బినామీ లాంటిది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుంది' అని తెలిపారు.

English summary
Prabhas shared in FB: "Very entertaining trailer.... Best wishes to Pramod, Vamsi, Sharwaa and Gandhi for Express Raja."
Please Wait while comments are loading...