»   »  ట్రైలర్ చూసి షాకై,ఎంక్వైరీ చేసిన ప్రభాస్

ట్రైలర్ చూసి షాకై,ఎంక్వైరీ చేసిన ప్రభాస్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ ప్రభాస్ రీసెంట్ గా ఓ చిత్రం ట్రైలర్ చూసి షాకయ్యి వెంటనే ఆ సినిమా గురించి ఎంక్వైరీ చేసారు. ఇంతకీ ఏ సినిమా అదీ అంటే తమిళంనుంచి తెలుగుకి డబ్బింగ్ అవుతున్న గజరాజు(కుమ్కీ)చిత్రం. విజయ్ తాజా చిత్రం తుపాకి ని చెన్నై లో చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ లో కుమ్కీ ట్రైలర్ వేసారు. ఈ ట్రైలర్ రాగానే జనాలు నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దాంతో వెంటనే ఎవరా కొత్త హీరో,ఏంటా సినిమా అని ఎంక్వైరీ చేసారు. తర్వాత ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు హీరో అని తెలుసుకుని కంగ్రాట్స్ తెలిపారట. ఈ విషయాన్ని ప్రముఖ దర్సకుడు లింగు స్వామి...కుమ్కీ చిత్రం ప్రీ రిలీజ్ మీడియా మీట్ లో తెలియచేసారు.

  ఇక గజరాజు విషయానికి వస్తే..శివాజీ గణేశన్ మనవడు, ప్రభు కుమారుడు విక్రమ్‌ప్రభు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'గజరాజు'. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో లింగుస్వామి తమిళంలో నిర్మిస్తున్న 'కుంకి' చిత్రానికి ఇది తెలుగు రూపం. శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ సురేశ్, బెల్లంకొండ గణేశ్‌బాబు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ అధినేత రజత్ పార్థసారథి సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని బెల్లంకొండ సురేశ్ చెప్పారు.

  బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ "శివాజీ గణేశన్ మనవడు విక్రమ్ ప్రభు పరిచయ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు గర్విస్తున్నా. ఈ చిత్రాన్ని అరకులో ఎక్కువ భాగం చిత్రీకరించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఆడియో పెద్ద హిట్టయింది. ఇమామ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు. ప్రభు మాట్లాడుతూ "నాన్నగారినీ, నన్నూ ఎంతగానో ప్రేమించిన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు నా కుమారుణ్ణీ దీవించాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ కావాలనుకున్న విక్రమ్ యాక్టర్ అయ్యాడు'' అన్నారు.

  తమిళ వెర్షన్ నిర్మాత లింగుస్వామి మాట్లాడుతూ "కొత్త హీరోలా కాకుండా ఎంతో అనుభవమున్న నటునిలా చేశాడు విక్రమ్ ప్రభు. నటన అనేది ఆయన రక్తంలోనే ఉంది. ప్రభు సాల్మన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాడు'' అని చెప్పారు. ఈ చిత్రంతో తెలుగులో అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉందని హీరోయిన్ లక్ష్మీ మీనన్ తెలిపారు.

  విక్రమ్ ప్రభు మాట్లాడుతూ "తాతయ్య, నాన్నను ఆదరించినట్లే నన్నూ తెలుగు ప్రేక్షకులకు ఆదరించాలని కోరుకుంటున్నా. తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ పాటలు హిట్టవుతాయని ఆశిస్తున్నా'' అన్నారు. 'ప్రేమ ఖైదీ' తర్వాత తన దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదేననీ, ఏనుగుతో కలిసి నటించడం అంత సులువైన పని కాదనీ, కానీ విక్రమ్ ప్రభు ఎలాంటి భయం లేకుండా నటించాడనీ ప్రభు సాల్మన్ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుకుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభు సాల్మన్.

  English summary
  It is heard that Prabhas was watching the film 'Thuppakki' which has Vijay and Kajal Agarwal in the lead. Sources say before the interval the trailer of the film 'Kumki' came up and Prabhas was shocked at the response it got from the audience. Surprised by that, Prabhas reportedly asked who it was and discovered the hero of 'Kumki' was Vikram Prabhu, son of senior Tamil actor Prabhu and grandson of Sivaji Ganesan. The film has Lakshmi Menon as the heroine.This was reportedly revealed by the noted Tamil director Lingusamy at the pre-release function of his Tamil film 'Kumki'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more