For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజం : బాలీవుడ్ సినిమాలో ప్రభాస్ సైలెంట్ ఎంట్రీ

  By Srikanya
  |

  ముంబై: ఎవరికీ చెప్పాపెట్టకుండా ప్రభాస్.. సైలెంట్ గా బాలీవుడ్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్ చేసారు. నిన్న(శుక్రవారం) విడుదలైన ప్రభుదేవా చిత్రం యాక్షన్ జాక్సన్ లో ప్రభాస్ కనిపించి అందరనీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఫుల్ లెంగ్త్ రోల్ మాత్రం చేయలేదు. కొద్ది క్షణాలు మాత్రం తెరపై కనపడి అభిమానులను ఆనందపరిచారు. ఓ పాటలో షాహిద్ కపూర్, ప్రభాస్ కలిసి కనిపించారు. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ చేసి ఉండటంతో ఆ చనువుతో ఈ చిత్రంలో గెస్ట్ గా చేసారు. అజయ్ దేవగన్,సోనాక్షి కాంబినేషన్ రూపొందిన ఈ చిత్రం నిన్నే విడుదలైంది.అయితే చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

  ఇక ప్రభాస్ తాజా చిత్రం బాహుబలి లేటెస్ట్ ఇన్ఫో...

  చారిత్రాత్మక కథతో రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ బాహుబలి '. ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా తమ్ముడిగా భళ్లాల దేవుడి పాత్రలో రానా నటిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య భారీ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌. దీనికోసం రామోజీ ఫీలింసిటీలో భారీ సెట్‌ను వేశారు. ఈనెలఖారు వరకు ఈ సన్నివేశాలు కొనసాగుతాయి.

  తెలుగు చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందుతున్న సినిమా కావడంతో ఫైట్‌ సన్నివేశాన్ని పీటర్‌హెయిన్స్‌తో పాటు రాజమౌళి సవాలుగా తీసుకున్నారని ఫిలింనగర్‌ సమాచారం. అనుష్క, తమన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ లాంటి సీనియర్లు నటిస్తున్నారు.

  అలాగే...ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

  Prabhas Silently Makes His Bollywood debut

  ఇక ...

  కవచాలు, శిరస్త్రాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడే యోధుడిగా ప్రభాస్‌ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. 'మేకింగ్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

  'బాహుబలి' గా ప్రభాస్‌ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.

  అలాగే...

  ప్రభాస్ తదుపరి చిత్రం ఏం చేయబోతున్నారనేది ప్రభాస్ అభిమానుల్లోనే కాక సినీ అభిమానుల్లోనూ ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే రాజమౌళి తో చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి తర్వాత చేయబోయే చిత్రం ఎంపిక చాలా క్లిష్టమైనది. అయితే ఆల్రెడీ ప్రభాస్ ... కథ విని డైరక్టర్ ని ఓకే చేసేసాడని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు నెట్ జనులకు షార్ట్ ఫిల్మ్ మేకర్ గా...బయిట జనాలకు రన్ రాజా రన్ దర్శకుడుగా పరిచయం అయిన సుజీత్.

  ప్రభాస్ కజిన్ ప్రమోద్ ఉప్పలపాటి కో ప్రొడ్యూసర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ కృష్ణా రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తారు.మిస్టర్ ఫెరఫెక్ట్, వర్షం చిత్రాల తరహా కథతో ఈ చిత్రం ఉండబోతోందని, రన్ రాజా రన్ తరహా ఫ్రెష్ నేరేషన్ తో సబ్జెక్టుని డీల్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సుజీత్ ఇప్పటివరకూ 50కు పైగా షార్ట్ ఫిలింలు చేసారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

  English summary
  Prabhas made a silent entry into Bollywood. He made strong special appearance in Prabhu Deva's latest entertainer Action Jackson, which hit the screens today in a grand manner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X