»   » విషాదం: ప్రభాస్ కి, ఫ్యాన్స్ కి తీరని లోటే

విషాదం: ప్రభాస్ కి, ఫ్యాన్స్ కి తీరని లోటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ వీరాభిమాని, ప్రభాస్ స్టేట్ ఫ్యాన్స్ అసోశియేషన్ అధ్యక్ష్యుడు శంకర్ నిన్న మరణించారు. ఆయన మరణ వార్త ఆయన అభిమానులను కలిచి వేసింది. ప్రభాస్ తోనూ,కృష్ణంరాజుతోనూ శంకర్ కి మంచి అనుభందం ఉండేదని చెప్తారు. ఈ విషయమై ప్రభాస్ చాలా బాధపడుతూ నివాళులు అర్పించారు.

ప్రభాస్ మాట్లాడుతూ... " నా ఫ్యాన్స్ అశోశియేషన్ ప్రెసిడెంట్ శంకర్ ఇక లేరు అనే వార్త చాలా బాధ గా ఉంది. చాలా సంవత్సరాలుగా అతను నాకు, పెద్ద నాన్నగారికి పెద్ద బలం. ". ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ని తెలియచేసారు.

ప్రస్తుతం ప్రభాస్ సర్జరీ చేయించుకుని రెస్ట్ లో ఉన్నారు. ఈ విషయమై ప్రభాస్ స్పందిస్తూ... 'నేను ఒక నెల క్రితం షోల్డర్ సర్జరీ చేసుకున్నాను. చాలా రోజుల క్రితమే చేసుకోవాల్సిన ఈ సర్జరీని చాలా ఆలస్యం చేసి ఇప్పుడు చేసుకున్నాను. సర్జరీ విజయవంతంగా జరిగింది. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను. మరో నెల రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటాను' అని చెప్పారు.

ఇక బాహుబలి ప్రాజెక్టు ప్రారంభం నుంచీ ప్రభాస్ బరువులో మార్పు వస్తోంది. ఆరు నెలల క్రితం 82 కేజీలు ఉన్న ప్రభాస్ ఇప్పుడు 102 కేజీలకు చేరుకున్నాడని సమాచారం. హీరోలు సాధారణంగా బరువు తగ్గించుకుంటారు..కానీ బరువు పెరగటమేంటి అనిపిస్తోందా...ప్రభాస్ ది వ్యాయామాలతో పెరిగిన జిమ్ బాడీ.

Prabhas State-wide Fans Association President is no more

రాజమౌళి చిత్రంలో క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఆయన ఇలా పెరిగారు. అందులో ఆయన శివుడుగా, బాహుబలిగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన చాలా కఠినమైన వ్యాయామాలు చేయటమే కాక, ఆహార పరంగానూ నియమాలు పాటించారని చెప్తున్నారు. గత వేసవి నుంచే ఈ బరువు పెంచటం మొదలెట్టారని తెలుస్తోంది. అందుకోసం ఆయన ఆహారం లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

ఇందుకోసం ఆయన యూ ఎస్ వెళ్లి,అక్కడ రెజ్లర్స్ ట్రైనింగ్ తీసుకునే పద్దతని తెలుసుని,నియమాలు తెలుసుకుని వచ్చారట. తన బాడీని బిల్డ్ చేయటం కోసం వారి శారీరక బాషను,వర్కవుట్స్ ని గమనించి వచ్చారు ప్రభాస్. వాటికి సంభందించిన పరికరాలు దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి కొన్నాడని తెలుస్తోంది. ఆ జిమ్ సామగ్రి మొత్తం తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న జిమ్ లో ఏర్పాటు చేసుకుని, ట్రైనర్ ని పెట్టుకున్నారు.

అలాగే ప్రభాస్ ఆహారంలోనూ పూర్తి మార్పులు తెచ్చారు. దాదాపు రోజుకు నలభై కోడి గుడ్డు వైట్స్ తీసుకునేవారు. దానితో కలిపి ప్రొటీన్ పౌడర్ కలిపి తీసుకున్నారు. అలాగే రోజూ దాదాపు ఆరు గంటలు పాటు వర్కవుట్ చేసి మరీ షేప్ తెచ్చుకున్నారు. అదే మనం బాహుబలిలో చూడబోయే లుక్.

English summary

 Shankar who is the President of Prabhas State-wide Fans Association breathed his last Yesterday. Prabhas reacted: "Deeply saddened by the demise of Shankar, the president of my fans association. He was a great source of strength for me and pedananna garu since many years. Praying for his family".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu