»   » దర్శకుడికి షాకిచ్చిన ప్రభాస్.. యూరప్‌లో పూజాతో రొమాంటిక్ లవ్‌స్టోరి

దర్శకుడికి షాకిచ్చిన ప్రభాస్.. యూరప్‌లో పూజాతో రొమాంటిక్ లవ్‌స్టోరి

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Prabhas Surprised Sujeeth With His Performance

  బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. బాహుబలి రిలీజై ఏడాది గడుస్తున్నా యంగ్ రెబల్ స్టార్ సినిమా రిలీజ్ కాకపోవడం అభిమానులను కలవరానికి గురిచేస్తుంది. సాహో తర్వాత మరో సినిమా లేట్ కాకుండదనే అంశంతో ప్రభాస్ తన సినిమాల వేగం పెంచినట్టు కనిపిస్తున్నది.

  జిల్ డైరెక్టర్‌తో ప్రభాస్

  జిల్ డైరెక్టర్‌తో ప్రభాస్

  సాహో షూటింగ్‌ను ఓ పక్క కానిస్తూనే మరో పక్క తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టారు. జిల్ చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణతో ఓ రొమాంటిక్ లవ్ స్టోరిని ప్లాన్ చేశారు. ఈ సినిమా యూరప్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందనున్నది.

  ఆలస్యంగా ప్రభాస్ తదుపరి మూవీ

  ఆలస్యంగా ప్రభాస్ తదుపరి మూవీ

  వాస్తవానికి రాధాకృష్ణతో ప్రభాస్ సినిమా జూన్ మాసంలోనే పట్టాలెక్కాల్సింది. కానీ దుబాయ్‌లో సాహో సినిమా యాక్షన్ పార్ట్‌లో ప్రభాస్ బిజీగా ఉండటంతో ఆ చిత్రం సెట్స్‌లోకి వెళ్లలేకపోయింది. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్‌తో పూజా హెగ్డే జతకట్టనున్నది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

  ప్రభాస్ కోసం రిచ్ సెట్

  ప్రభాస్ కోసం రిచ్ సెట్

  యూరప్ బ్యాక్‌డ్రాప్‌గా రాధాకృష్ణ చిత్రం ఉన్నందున ప్రధాన సన్నివేశాలను అక్కడే చిత్రీకరించనున్నారు. కొన్ని సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంటుంది కనుక వాటి కోసం హైదరాబాద్‌లో విదేశీ వాతావరణం ప్రతిబింబించే విధంగా సెట్స్‌కు రూపకల్పన చేయనున్నట్టు సమాచారం.

  సుజిత్‌కు ప్రభాస్ షాక్

  సుజిత్‌కు ప్రభాస్ షాక్

  అబుదాబిలో సాహో చిత్రం నిర్విరామంగా 35 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే విధంగా యాక్షన్ సీన్లు, కారు ఛేజింగ్ అద్భుతంగా చిత్రీకరించినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. యాక్షన్ సీన్లలో డూప్ లేకుండా ప్రభాస్ స్వయంగా పాల్గొని సాహసానికి పూనుకోవడం దర్శకుడు సుజిత్‌కు షాక్ తగిలిందట. ప్రభాస్ స్వయంగా యాక్షన్ సీన్లలో పాల్గొనడం వల్ల సమయం, గ్రాఫిక్స్ కోసం కొంత ఖర్చు కూడా తగ్గిందని దర్శకుడు సుజిత్ మీడియాకు వెల్లడించారు.

  English summary
  Actor Prabhas is currently busy shooting for the much-awaited action film Saaho which is being shot simultaneously in Hindi and Telugu. The actor, along with his crew members, is in Dubai to shoot some sleek action sequences. A couple of pictures of the actor from the sets of the film surfaced on social media. Lead actor Prabhas is said to have surprised Sujeeth with his performance. “The entire unit was flabbergasted to see Prabas doing his own action sequences and car chases.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more