twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ రేంజి అని ప్రభాస్, హిమాలయాలతో పోల్చిన త్రివిక్రమ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'విశ్వరూపం' చిత్రం హాలీవుడ్ సినిమా స్టాండర్స్‌తో ఉందని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విశ్వరూపం ప్రెస్ మీట్లో ప్రభాస్ మాట్లాడుతూ నేను కమల్ హాసన్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆయన పక్కన కూర్చోవడం ఎంతో గొప్పగటా ఫీలవుతున్నాను. మా జనరేషన్‌కు మాత్రమే కాదు... మరో పది తరాలకు ఆయన ఆదర్శనీయం అని చెప్పుకొచ్చారు ప్రభాస్.

    దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... కమల్ హాసన్ దేశాన్ని విడిచి పోతానని వ్యాఖ్యానించడం నన్ను ఎంతో కలిచి వేసింది. హిమాలయాలు చలిగా ఉన్నంత మాత్రాన వాటిని అసహ్యించుకోలేం. అవి ఇండియాలోనే ఉంటాయి. కమల్ హాసన్ ను కూడా భారతీయ చిత్ర పరిశ్రమ వదులుకోదు అని వ్యాఖ్యానించారు.

    అదే విధంగా ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మాట్లాడుతూ... సినిమాపై కమల్ హాసన్ కు పూర్తి పట్టుంది. ఆయన ఏ ఒక్క విభాగానికో పరిమితం కాలేదు. 24 విభాగాలపై ఆయనకు పట్టుంది. ఆయన మామూలు సినిమాలు చేయడానికి ఇష్ట పడరు. ప్రయోగాలకు పెట్టింది పేరు ఆయన. ఆయన వల్లే నేను సినిమాల్లో నటించాను అని చెప్పుకొచ్చారు.

    విశ్వరూపం చిత్రం తెలుగు నాట సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ఆచిత్ర హీరో, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ టాలీవుడ్ ప్రముఖులతో కలిసి హైదరాబాద్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగార్జున, ప్రభాస్, డి రామానాయుడు, ఎ. రమేష్ ప్రసాద్ హాజరయ్యారు.

    English summary
    Prabhas about Kamal Hassan: “Sitting in the same dais of Kamal Hassan is a great honor to me. I am too small to talk about Kamal Hassan and I grew up watching his films. I think Kamal Hassan will inspire the next 10 generations.” Prabhas said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X