»   » నిజమే...సర్జరీ చేయించుకున్నా: ప్రభాస్

నిజమే...సర్జరీ చేయించుకున్నా: ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ కొద్ది రోజుల క్రితం తన కజిన్ వివాహానికి చేతికి కట్టుతో, హ్యాండ్ సపోర్ట్ స్టిక్ తో కనిపించారు. దాంతో బాహుబలి షూటింగ్ లో గాయపడ్డాడు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఈ రూమర్స్ రకరకాల కలర్స్ కి మారతూండటంతో ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా రూమర్స్ కు చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఓ పోస్ట్ ని పోస్ట్ చేసారు.

ప్రభాస్ ఫేస్ బుక్ లో రాస్తూ... 'నేను ఒక నెల క్రితం షోల్డర్ సర్జరీ చేసుకున్నాను. చాలా రోజుల క్రితమే చేసుకోవాల్సిన ఈ సర్జరీని చాలా ఆలస్యం చేసి ఇప్పుడు చేసుకున్నాను. సర్జరీ విజయవంతంగా జరిగింది. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను. మరో నెల రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటాను' అని చెప్పారు.

ఇక బాహుబలి ప్రాజెక్టు ప్రారంభం నుంచీ రాజమౌలి బరువులో మార్పు వస్తోంది. ఆరు నెలల క్రితం 82 కేజీలు ఉన్న ప్రభాస్ ఇప్పుడు 102 కేజీలకు చేరుకున్నాడని సమాచారం. హీరోలు సాధారణంగా బరువు తగ్గించుకుంటారు..కానీ బరువు పెరగటమేంటి అనిపిస్తోందా...ప్రభాస్ ది వ్యాయామాలతో పెరిగిన జిమ్ బాడీ.

Prabhas undergoes surgery

రాజమౌళి చిత్రంలో క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఆయన ఇలా పెరిగారు. అందులో ఆయన శివుడుగా, బాహుబలిగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన చాలా కఠినమైన వ్యాయామాలు చేయటమే కాక, ఆహార పరంగానూ నియమాలు పాటించారని చెప్తున్నారు. గత వేసవి నుంచే ఈ బరువు పెంచటం మొదలెట్టారని తెలుస్తోంది. అందుకోసం ఆయన ఆహారం లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

ఇందుకోసం ఆయన యూ ఎస్ వెళ్లి,అక్కడ రెజ్లర్స్ ట్రైనింగ్ తీసుకునే పద్దతని తెలుసుని,నియమాలు తెలుసుకుని వచ్చారట. తన బాడీని బిల్డ్ చేయటం కోసం వారి శారీరక బాషను,వర్కవుట్స్ ని గమనించి వచ్చారు ప్రభాస్. వాటికి సంభందించిన పరికరాలు దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి కొన్నాడని తెలుస్తోంది. ఆ జిమ్ సామగ్రి మొత్తం తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న జిమ్ లో ఏర్పాటు చేసుకుని, ట్రైనర్ ని పెట్టుకున్నారు.

అలాగే ప్రభాస్ ఆహారంలోనూ పూర్తి మార్పులు తెచ్చారు. దాదాపు రోజుకు నలభై కోడి గుడ్డు వైట్స్ తీసుకునేవారు. దానితో కలిపి ప్రొటీన్ పౌడర్ కలిపి తీసుకున్నారు. అలాగే రోజూ దాదాపు ఆరు గంటలు పాటు వర్కవుట్ చేసి మరీ షేప్ తెచ్చుకున్నారు. అదే మనం బాహుబలిలో చూడబోయే లుక్.

ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.


ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని,విశ్వరూపం ప్రదర్శశిస్తోంది.

English summary
Prabhas himself took to his Facebook account immediately to put an end to rumors. The actor had shoulder surgery which was routine and preplanned. He is fine and will resume shooting in a month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu