»   » సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘వారధి’

సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘వారధి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రానికి 'వారధి' అనే పేరు పరిశీలనలో ఉంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి. 'వారధి' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, అంతకంటే పవర్ ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నామని, ప్రభాస్ ఇమేజ్‌కు తగిన విధంగా మరో మంచి టైటిల్ కోసం వెతుకున్నామని చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఇక ప్రభాస్-తమన్నా, దీక్షాసేథ్ హీరో హీరోయిన్లుగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన 'రెబల్' చిత్రం సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం అవుతోంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

మొత్తానికి 'రెబల్' సినిమా మూడ్ నుంచి బయట పడక ముందే ప్రభాస్ అభిమానులకు 'వారధి' రూపంలో సంక్రాంతికి సినిమా పండగ చేసుకునే అవకాశం దక్కబోతోంది. ఈ రెండు చిత్రాలతో ప్రబాస్ వరుస హిట్ కొడితే మాత్రం ప్రభాస్ ఓ రేంజికి వెళ్లి పోవడం ఖాయం.

English summary
NTR's Baadshah, Venkatesh's Shadow and Ram Charan's Nayak are the ones certainly releasing for the 2013 Sankranthi. And it's been strongly buzzed that Prabhas' Varadhi might also be in queue for the Sankranthi release.
Please Wait while comments are loading...