twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇవాంకాకు బాహుబలి ప్రభాస్ దూరం.. కారణం ఇదే..

    By Rajababu
    |

    Recommended Video

    ఇవాంకాకు బాహుబలి ప్రభాస్ దూరం

    బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి సినిమా బిజినెస్ సత్తాను నిరూపించిన చిత్రం బాహుబలి2. దర్శకుడు రాజమౌళి రూపొందించిన చిత్రానికి ప్రభాస్ వెన్నుముకగా నిలిచారు. ఈ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాదరణను కూడగట్టుకొన్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొనే సదస్సుకు దూరం కావడం చర్చనీయాంశమైంది.

     ఆహ్వన పత్రంలో లేని ప్రభాస్

    ఆహ్వన పత్రంలో లేని ప్రభాస్

    బాహుబలితో మంచి కమర్షియల్‌ హీరోగా సినీ వర్గాల నుంచి కొనియాడిన ప్రభాస్‌ను తొలుత గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు ఆహ్వానించాలని ప్రభుత్వం భావించింది. అయితే చివరి నిమిషంలో ఆహ్వానితుల జాబితాలో ప్రభాస్ పేరు లేకపోవడం ఓ వర్గాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

     సినీ ప్రముఖులు దూరం

    సినీ ప్రముఖులు దూరం

    ఇవాంకా నేతృత్వంలో జరిపే అంతర్జాతీయ సదస్సుకు ప్రభాస్‌ను ఆహ్వానించి పారిశ్రామిక వర్గాలకు స్ఫూర్తిగా నిలిచేలా చూడాలని భావించారట. అయితే ఆ తర్వాత సినీ ప్రముఖులను ఆహ్వానించడం వల్ల సదస్సు లక్ష్యం దెబ్బతింటుందని కొందరు వెల్లడించిన అభిప్రాయం మేరకు తమ ఆలోచనను మానుకొన్నారట.

     వ్యాపారవేత్తలుగా సినీ తారలు

    వ్యాపారవేత్తలుగా సినీ తారలు

    అయితే ఇవాంకా సదస్సుకు కొందరు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. అయితే వారు సినీ తారల హోదాలో కాకుండా వ్యాపారవేత్తలుగా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

     హైదరాబాద్‌కు చేరుకొన్న ఇవాంకా

    హైదరాబాద్‌కు చేరుకొన్న ఇవాంకా

    అత్యంత ప్రతిష్ఠ్మాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యాపార సదస్సు కోసం ఇవాంకా ట్రంప్ మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇవాంకకు అధికారులు ఘన స్వాగతం పలికారు.

    సదస్సులో ఇవాంకా..

    సదస్సులో ఇవాంకా..

    ఈ అంతర్జాతీయ సదస్సులో ఇవాంకా ట్రంప్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని చేయనున్నారు. అనేక మంది వ్యాపారవేత్తలతో ఆమె మాట్లాడుతారు. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకొనే విధంగా సందేశాన్ని ఇవ్వనున్నారు.

     సక్సెస్‌ఫుల్ పారిశ్రామికవేత్తగా

    సక్సెస్‌ఫుల్ పారిశ్రామికవేత్తగా

    అమెరికాలో ఇవాంకా సక్సెస్‌ఫుల్ పారిశ్రామికవేత్తగా పేరు సంపాదించుకొన్నారు. ఆమె దుస్తులు, పాదరక్షల వ్యాపారంలో విశేష అనుభవం సంపాదించారు.

     మేడిన్ అమెరికాకు మద్దతు

    మేడిన్ అమెరికాకు మద్దతు

    ఇవాంకా నిర్వహించే వ్యాపార ఉత్పత్తులన్నీ చైనాలో తయారు అవుతాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న కారణంగా సొంతంగా అమెరికాలోనే ఉత్పత్తులను చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. స్వదేశీ పారిశ్రామిక రంగానికి ఊతం ఇవ్వాలని ట్రంప్ రూపొందించిన తొలి విధానానికి ఆమె మద్దతు పలికారు.

     ప్రధాని మోదీ, ఇవాంకా హాజరు

    ప్రధాని మోదీ, ఇవాంకా హాజరు

    హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వ్యాపార సదస్సుకు రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, సినీ, ఇతర వర్గాలు హాజరుకానున్నాయి. భారత పారిశ్రామిక వర్గాలకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహిస్తుండగా, అమెరికా వర్గాలకు ఇవాంకా నేతృత్వం వహిస్తున్నారు.

    ఇవాంకాకు భారీ భద్రత

    ఇవాంకాకు భారీ భద్రత

    ఇవాంకా పాల్గొనే సదస్సు కారణంగా హైదరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సదస్సు నిర్వహించే ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించారు. సాయుధ దళాలను మోహరించారు. హైదరాబాద్‌లో ఎటు చూసినా భారీ భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి.

    ఇవాంకా ట్రంప్ కుటుంబం

    ఇవాంకా ట్రంప్ కుటుంబం

    ఇవాంకా ట్రంప్ జరేద్ కుష్నర్ అనే వ్యక్తిని వివాహం చేసుకొన్నది. ఇవాంకాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌లో కూడా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

    English summary
    The Baahubali 2 star Prabhas is the talk of the town as his larger than life film shattered all the records at the box office and people are eagerly waiting for his next release Saaho. For the success that he's achieved, the Government had to invite him for the Global Entrepreneurship Summit in Hyderabad led by Ivanka Trump, but it is reported that his name is not even mentioned in the invite.Ivanka Trump Ivanka Trump to arrive in India with a delegation for the Global Entrepreneurship Summit which will be held in Hyderabad. Global Entrepreneurship Summit Entrepreneurs across India will get an opportunity to meet and interact with Ivanka Trump and listen to her inspiring speech.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X