»   » ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదిరిపోయే న్యూస్.. 23న పండుగే పండుగ..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదిరిపోయే న్యూస్.. 23న పండుగే పండుగ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి' ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త. బాహుబలి2 సినిమాతోపాటు ఫ్యాన్స్ డబుల్ ధమాకా రానున్నది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా టీజర్ ఈ నెల (ఏప్రిల్) 23న విడుదల కానున్నది. ఈ చిత్రానికి సాహో అని పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. సుజిత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో 19వది. ఈ టీజర్‌ను బాహుబలి ది కన్‌క్లూజన్‌తోపాటు ప్రదర్శించనున్నారు.

ఏడాది క్రితం గ్రీన్ సిగ్నల్

ఏడాది క్రితం గ్రీన్ సిగ్నల్

ఏడాది క్రితం సుజిత్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాహుబలి2 సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్ర షూటింగ్‌ను మొదలుపెట్టారు. అయితే వాస్తవానికి ఈ సినిమా అంతకుముందే ప్రారంభమైందని, ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరుచాలని దర్శకుడు సుజిత్ నిర్ణయించినట్టు సమాచారం.

23న టీజర్, ఫస్ట్‌లుక్

23న టీజర్, ఫస్ట్‌లుక్

సుజిత్ డైరెక్షన్‌లో వచ్చే ఈ చిత్రం నాలుగు భాషల్లో రూపొందుతున్నది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభాస్ 19వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నాం. ఈ సినిమా టైటిల్‌ను, పోస్టర్‌ను ఏప్రిల్ 23న ప్రకటిస్తాం. బాహుబలి2 సినిమాతోపాటు నాలుగు భాషల్లో టీజర్‌ను విడుదల చేస్తాం అని దర్శకుడు సుజిత్ తెలిపాడు.

రెండేళ్లుగా వెయిటింగ్..

రెండేళ్లుగా వెయిటింగ్..

ప్రభాస్‌తో సినిమా కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. టీజర్ కోసం పనిచేయడం ఒక సినిమా కోసం కంటే ఎక్కువ శ్రమించినంత పనవుతున్నది. టీజర్‌కు ముంబైలో తుది మెరుగులు దిద్దుతున్నాం అని సుజిత్ రెడ్డి వెల్లడించారు. టీజర్ అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతుందనే ధీమాను సుజిత్ వ్యక్తం చేశాడు.

150 కోట్ల బడ్జెట్

150 కోట్ల బడ్జెట్

ప్రభాస్ 19వ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం స్టంట్లు, యాక్షన్ సీన్ల కోసం ఖర్చుపెడుతున్నాం. ఈ సినిమాలో అనేక కమర్షియల్ హంగులు ఉన్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే కొత్త పాయింట్ ఈ చిత్రంలో ఉన్నది అని సుజిత్ తెలిపాడు.

ఒక్క యాక్షన్ సీన్‌కే 35 కోట్లు

ఒక్క యాక్షన్ సీన్‌కే 35 కోట్లు

ఈ సినిమాలో కీలక సన్నివేశమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ సినిమా బడ్జెట్‌పై ఇంకా నిర్ధారణకు రాలేదు. ఫైట్స్‌ను నభూతో నభవిష్యత్‌ అనే రీతిలో చిత్రీకరిస్తామని ముందే చెప్పాను.

జేమ్స్‌బాండ్ సినిమాలా..

జేమ్స్‌బాండ్ సినిమాలా..

ఈ చిత్రం స్టైలిష్‌గా ఉండటమే కాదు.. జేమ్స్ బాండ్ సినిమాను తలదన్నేలా ఉంటుంది. ఈ సినిమా కథలో ఎమోషన్స్, డ్రామా అని అంశాలు ఉంటాయి. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందని కచ్చితంగా చెప్తున్నాను అని సుజిత్ తెలిపాడు.

ఫైట్స్ కోసం కెన్నీ బేట్స్

ఫైట్స్ కోసం కెన్నీ బేట్స్

యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించేందుకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్‌ను రంగంలోకి దించాం. కెన్నీ అద్భుతంగా యాక్షన్ సీన్లను రూపొందిస్తున్నాడు. ఈ యాక్షన్ సీన్ల చిత్రీకరణ కోసం యూరప్‌లోని కొన్ని ప్రదేశాలను, అబుదాబీలోని కొన్ని లోకేషన్లను ఇప్పటికే ఖారారు చేశాం. మే చివరికల్లా యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తాం అని సుజిత్ చెప్పుకొచ్చారు.

సాబుసిరిల్, శంకర్ ఎహసాన్, లాయ్..

సాబుసిరిల్, శంకర్ ఎహసాన్, లాయ్..

అంతర్జాతీయ హంగులతో నిర్మిస్తున్న ప్రభాస్ చిత్రానికి శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాదీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నాడు. జాతీయ స్థాయికి, బాలీవుడ్‌కు తగినట్టు సంగీతం ఉండాలనే ఉద్దేశంతో సంగీత త్రయాన్ని రంగంలోకి దించాం. గతంలో దక్షిణాది చిత్రాలకు కూడా వారు సంగీతం అందించారు అని సుజిత్ పేర్కొన్నారు.

English summary
The first look of actor Prabhas'next movie Prabhas19, directed by Sujeeth, will be released on April 23 and its teaser will be screened with Baahubali 2: The Conclusion. Prabhas signed a movie with Sujeeth a year ago and he was purported to start shooting for it after the release of Baahubali 2. But the latest news suggests he has already begun filming and is set to surprise his fans by releasing its first look and teaser before his most-awaited movie hits the screens.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu