»   » పేరు నాది, డబ్బు వేరొకరిది: నిజం ఒప్పుకున్న ప్రభుదేవా

పేరు నాది, డబ్బు వేరొకరిది: నిజం ఒప్పుకున్న ప్రభుదేవా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్‌లో తమిళ డైరెక్టర్ ఎఎల్. విజయ్ దర్శకత్వంలో తెకెక్కుతున్న త్రిబాషా చిత్రం(తెలుగు, తమిళం, హిందీ) 'అభినేత్రి'. ఈ సినిమాను మూడు భాషల్లో వేర్వేరు టైటిల్స్ తో రిలీజ్ చేయబోతున్నారు.

ఈ చిత్రానికి తెలుగులో 'అభినేత్రి' అనే టైటిల్ ఫిక్స్ చేయగా... తమిళంలో 'డెవిల్' పేరుతో, హిందీలో 'టూ ఇన్ వన్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ 'అభినేత్రి'కి ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్ ను ప్రభుదేవా, హిందీ వర్షన్ ను సోనూసూద్ లు నిర్మిస్తున్నారు.


అక్టోబర్ 7న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు వెర్షన్ 'అభినేత్రి' ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు, తన వ్యక్తిగత విషయాలను పచుకున్నారు.


అనుకోకుండా నేను ఈ సినిమాలో హీరోనయ్యా

అనుకోకుండా నేను ఈ సినిమాలో హీరోనయ్యా

ఈ కథను నా ప్రొడక్షన్‌ హౌస్‌లో చేయాలని దర్శకుడు విజయ్‌గారు నన్ను కలిసి వేరే హీరోను అనుకుని కథ చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఆ హీరోతో సినిమా మొదలు కాలేదు. ప్రాజెక్టు లేటవుతుండటంతో డైరెక్టర్‌ విజయ్‌ మీరే హీరోగా చేయండి సార్‌...అన్నాడు. అలాగే తమిళ నిర్మాత గణేష్‌గారు కూడా నన్నే హీరోగా చేయమని అన్నారు. కథ నాకు నచ్చడం, చేసే సమయం కూడా ఉండటంతో ఒప్పుకున్నాను అని ప్రభుదేవా తెలిపారు.


పేరు నాది, డబ్బు మాత్రం వేరొకరిది

పేరు నాది, డబ్బు మాత్రం వేరొకరిది

హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా.... ఇవన్నీ నాకు అనుకోకుండా వచ్చిన అవకాశాలే. నేను కావాలని ప్లాన్ చేసుకుని ఈ రంగాల్లోకి రాలేదు. కొరియోగ్రాఫర్‌గా ఉన్నప్పుడు, అప్పుడప్పుడు స్పెషల్‌సాంగ్స్‌ చేస్తుండేవాడిని. ఒకరోజు పవిత్రన్‌గారు వచ్చి, నువ్వు బాగా చేస్తున్నావ్‌..నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానన్నారు. నేను సరేనన్నాను. అలాగే 'వర్షం' సినిమాలో ఎన్నాళ్ళకు గుర్తొచ్చానో వాన..సాంగ్‌ చేస్తున్నప్పుడు ఎం.ఎస్‌.రాజుగారు వచ్చి ప్రభు నువ్వు నా బ్యానర్‌లో నెక్ట్స్‌ మూవీని డైరెక్ట్‌ చేస్తావా అన్నారు. నేను సరేనన్నాను. అలాగే ఈ సినిమాకు కూడా గణేషన్‌గారు వచ్చి సార్‌..మీ పేరుపై ఓ బ్యానర్‌పెట్టి సినిమా చేస్తానని అన్నాడు. నేన సరేనన్నాను అని ప్రభుదేవా తెలిపారు.


సినిమా గురించి మాట్లాడుతూ

సినిమా గురించి మాట్లాడుతూ

అభినేత్రి మూవీ స్ట్రాంగ్‌ లేడీ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌. ఇలాంటి జోనర్‌ సినిమాను డైరెక్ట్‌ చేయాలనే కోరిక మనసులో ఉండేది. ఫుల్‌ కామెడితో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. న్న మెసేజ్‌ కూడా ఉంటుంది. హీరో, హీరోయిన్‌ దక్షిణాది నుండి ముంబైకి వెళ్ళే ఓ కథను సినిమాగా తీశాం. దర్శకుడు, కెమెరామెన్‌ సహా అందరూ ఎక్స్‌పర్ట్స్‌ కావడంతో నెటివిటీ సమస్య సినిమాలో లేకుండా జాగ్రత్త పడ్డారు అని ప్రభుదేవా తెలిపారు.


చాలా కష్టం, దర్శకుడు ఇంకెప్పుడూ చేయనన్నాడు

చాలా కష్టం, దర్శకుడు ఇంకెప్పుడూ చేయనన్నాడు

మూడు భాషల్లో సినిమా చేయడమంటే సులువు కాదు. విజయ్‌ అండ్‌ టీం చాలా కష్టపడ్డారు. షూటింగే కష్టమని ముందుగా చెప్పిన డైరెక్టర్‌ విజయ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ టైంలో మూడు భాషల్లో షూటింగ్‌ చేయడం, పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేయడం కంటే కష్టంగా ఉందని అన్నాడు. విజయ్‌ ఇంకెప్పుడూ మూడు భాషల్లో సినిమా చేయనని చెప్పేశాడు ప్రభుదేవా తెలిపారు.


సినిమాలో తన పాత్ర గురించి

సినిమాలో తన పాత్ర గురించి

ముంబై సిటీలోని యువకుడు మోడ్రన్‌ గర్ల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే నాన్న ప్రోద్భలంతో విలేజ్‌ పిల్లను పెళ్ళి చేసుకుంటాడు. ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టం ఉండదు. కానీ చివరకు వచ్చేసరికి తన భార్యను ఎక్కువగా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. ఈ సినిమాలో భార్యభర్త


కథకు అవసరం కాబట్టే డాన్స్ పెట్టాం

కథకు అవసరం కాబట్టే డాన్స్ పెట్టాం

ఈ సినిమా కథ ప్రకారం డాన్స్ అవసరం. నేను ఉన్నాను కాబట్టి డాన్స్ ఉంది అనుకోవద్దు. తమన్నా ఫుల్‌ బిజీగా ఉన్నా కూడా, ఈ సినిమా డ్యాన్స్‌ రిహార్సల్స్‌ కోసం దాదాపు 20 రోజులు పూర్తిగా కేటాయించింది. ఆమె రోజంతా ప్రాక్టీస్ చేసేది. చాలా హార్డ్ వర్కర్ అని ప్రబుదేవా తెలిపారు.


ఇరగదీద్దామనే ఆలోచన లేదు

ఇరగదీద్దామనే ఆలోచన లేదు

ఈ సినిమా మొదలు పెట్టే ముందు యాక్టింగ్ ఇరగదీద్దామనే ఆలోచన మాత్రం లేదు. తనతో పాటు చేస్తున్న యంగ్‌స్టర్స్‌ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే చాలు అనే ఉద్దేశంతో చేశాను. కథ తెలిసినా ఆ పర్టిక్యులర్‌ రోజు ఏ సీన్‌ తీస్తారో కూడా నాకు తెలిసేది కాదు. యూనిట్‌ ఏం చెబితే అది చేసేసి వచ్చేసేవాడిని అని ప్రభుదేవా తెలిపారు.


భయపెట్టే సినిమా కాదు

భయపెట్టే సినిమా కాదు

సినిమా పేరుకే హర్రర్‌ కామెడి కానీ...హర్రర్‌ అంతగా ఉండదు. మంచి ఫన్‌ ఉంటుంది. సినిమా ఫ్యామిలీ జోనర్‌ స్టయిల్‌లోనే సాగుతుంది. సాధారణంగా హర్రర్‌ సినిమాలంటే దెయ్యాన్ని చూపిస్తారు. కానీ ఈ సినిమాలో దెయ్యాన్ని చూపించలేదు. కానీ దెయ్యం ఉంటుంది. తెరపై సినిమా చూస్తే మీకు తప్పకుండా థ్రిల్లవుతారు అన్నారు ప్రభుదేవా.


చిరంజీవిగారే నా ఫేవరేట్‌...

చిరంజీవిగారే నా ఫేవరేట్‌...

డాన్స్ పరంగా చిరంజీవిగారు నాకు ఎప్పుడూ ఫేవరేట్‌. ఇప్పుడున్న యంగర్‌ జనరేషన్‌ హీరోస్‌లో ఒకరిద్దరని కాకుండా అందరూ డ్యాన్స్‌ బాగా చేస్తున్నారు. టాప్‌ లేచిపోద్ది..,మెగా మెగా ..., ఐ వాంట్‌ టు ఫాలో ఫాలో యు.. సాంగ్స్‌ సహా ఈ మధ్య చాలా సాంగ్స్‌ బాగా నచ్చాయి అని ప్రభుదేవా తెలిపారు.


డాన్స్ కాడమీ

డాన్స్ కాడమీ

డ్యాన్స్‌ అకాడమీ పెట్టాలనే ఆలోచనైతే ఉంది కానీ.... అది మొదలు పెడితే అదే లోకంగా ఉండాలి. ఆ జీవితం వేరుగా ఉంటుంది. ఆలోచనైతే ఉంది కానీ ఎలా చేయాలనేదే తెలియడం లేదు అని ప్రభుదేవా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.


English summary
Check out Prabhu Deva interview about Abhinetri movie. Abhinetri is an upcoming Indian horror comedy film co-written and directed by A. L. Vijay. It features Prabhu Deva, Tamannaah and Sonu Sood in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu