»   » ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ హీరో

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో సంచలన విజయం సాధించిన పోకిరి రీమేక్‌ 'వాంటెడ్‌' కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వం వహించారు. తొలి చిత్రంతోనే ఆయన బాలీవుడ్ పెద్ద హీరోల అందరి దృష్టిలో పడ్డారు. అయితే అక్కడ డేట్స్ కుదురక నెక్ట్స్ మళ్ళీ తమిళంలోనే చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మరోసారి బాలీవుడ్‌లో సినిమా చేయనున్నారు. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా రూపొందే చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమారే మీడియాకు వెల్లడించారు వెల్లడించారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్నారు. ఇక ప్రభుదేవా ప్రస్తుతం సంతోష్ శివన్ దర్సకత్వంలో రూపొందుతున్న ఊర్మి చిత్రానికి కొరియాగ్రఫీ అందిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, రీమేక్ కాదని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu