ఆ హీరోలకి కథలు చెప్పాలంటే వణుకు :ప్రభుదేవా
ప్రభుదేవా మాట్లాడుతూ.... ''రజనీకాంత్, కమల్‌హాసన్‌తో చిత్రాలను తెరకెక్కించాలనే కోరిక నాలో బలంగా ఉంది. వారికి కథ చెప్పాలంటేనే వణుకు పుడుతోంది. నేను చెప్పిన కథ వారికి నచ్చక నా ప్రతిభపై అనుమానం వ్యక్తం చేస్తే ఏం చేయాలన్నదే ఆ భయానికి కారణము''అని చెప్పాడు.
ఇక అన్నీ మాస్ చిత్రాలనే తీసున్నారని నాతో చాలామంది అంటున్నారు. సున్నితమైన కుటుంబ కథలను నా నుంచి ఆశించలేమా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. అనురాగాలు, ఆప్యాయతల కలయికగా ఉండే అలాంటి సినిమాలూ తెరకెక్కించాలని నాక్కూడా ఆశే. నిర్మాతలు అలాంటి కథలపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. యాక్షన్, మాస్ మసాలా చిత్రాలకే పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు. వారి అభిరుచి మేరకే నేనూ అలాంటి సినిమాలకే మెగాఫోన్ పట్టుకుంటున్నా అన్నారు.
ఇక పెళ్లి- విడాకులు, ప్రేమ- వైఫల్యం తర్వాత మరో కొత్తలోకానికి వచ్చానని చెబుతున్నాడు. పిల్లలు, వారి భవిష్యత్తే లోకమని చెబుతున్నాడు. అంతా దైవ నిర్ణయమని, ఏది జరిగినా తన మంచికే అంటున్నాడు. గతంలో జరిగిన సంఘటనల ద్వారా నేర్చుకున్నదేమిటి అన్న విషయానికి సమాధాన మిస్తూ... జరిగిన దాని గురించి ఏమాత్రం చింతించడం లేదు. వాటినే గుర్తు చేసుకుని భవిష్యత్తును భారంగా గడపట్లేదు. అదంతా దేవుడి నిర్ణయం అని చెప్పారు. నేను ఏదీ కోల్పోలేదు. నా ప్రపంచం నా పిల్లలే. అంతకు మించి పెద్దదేమీ లేదు అని తేల్చి చెప్తున్నారు.


Click it and Unblock the Notifications












