»   » స్టార్ విలన్ తో తమన్నా రొమాన్స్, నమ్మరా..ఫోటోలు ఇదిగో

స్టార్ విలన్ తో తమన్నా రొమాన్స్, నమ్మరా..ఫోటోలు ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగుతోంది తమన్నా. రీసెంట్ గా వచ్చిన 'ఊపిరి'తో హిట్ కొట్టి తన స్థాయిని మరింత పెంచుకున్న ఆమె ఇప్పుడు ఓ విలన్ తో రొమాన్స్ చేస్తోంది. అ విలన్ మరెవరో కాదు సోనూసూద్. అయితే నిజ జీవితంలో రొమాన్స్ కాదు లెండి.. సినిమాలోనే.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమన్నా తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా 'అభినేత్రి' అనే ఓ లేడీ ఓరియంటెడ్ హారర్ సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రభుదేవా నిర్మిస్తుండగా, తెలుగు వర్షన్‌కు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల సెట్స్‌మీదికెళ్ళిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. సోనూసూద్, తమన్నా జంటగా కనపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విలన్ నుండి హీరోగా మారిన వారి సరసన సోనూ కూడా చేరిపోయాడా లేదా, కథ ప్రకారం తమన్నా..అతనితో ఏదన్నా గేమ్ ఆడుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.

తమిళంలో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న ఏ.ఎల్.విజయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సోనూసూధ్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై తమన్నా చాలా ఆశలే పెట్టుకుంది.

ఎ.ఎల్.దర్శకుడిగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి ఎమ్‌వివి సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్ సమర్పకుడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కీలక పాత్రలో కనపడనున్నారట. ఈ త్రిభాషా చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు స్వరాలందిస్తుండటం విశేషం.

 రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ

రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ

''తన డాన్స్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసిన కింగ్‌ ఆఫ్‌ డాన్స్‌ ప్రభుదేవా దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల భారీ లెవల్‌లో చిత్రీకరించిన ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ పల్లవి వీడియోను జూన్‌ 3న అంటే ఈ రోజు విడుదల చేయబోతున్నాం.

ఈ రోజే

ఈ రోజే

కింగ్‌ ఆఫ్‌ డాన్స్‌ ఈజ్‌ బ్యాక్‌ అనిపించేలా ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ అందర్నీ ఉర్రూతలూగిస్తాయి. ఈ ఫంక్షన్‌కి సర్‌ప్రైజింగ్‌ గెస్టులు హాజరు కాబోతున్నారు. ఆ సర్‌ప్రైజింగ్‌ గెస్టులు ఎవరన్నది ఈ రోజు తెలుస్తుంది'' అన్నారు.

నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ...

నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ...

'ఫస్ట్‌ టైమ్‌ టైటిల్‌ రోల్‌ ప్లే చేస్తున్న తమన్నా చాలా ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది'' అన్నారు.

భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

ఈ చిత్రం 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతోంది.

అమి జాక్సన్ తో

అమి జాక్సన్ తో

ఈ చిత్రంలోని ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్‌ చేశారు. ఈ పాటలో ఎమీ జాక్సన్‌ ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది.

ఎవరెవరు..

ఎవరెవరు..

ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

English summary
Kona Venkat took to micro-blogging site Twitter to reveal the Abhinetri first look poster by tweeting: "Tmrw evening we are releasing two teasers from "ABHINETRI" at a grand event in Hyd. The event will be live!!" and "Tamanna played her career best role which has many shades.. First time she's playing d title role !! Check this out."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu