twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళికి థాంక్స్ చెప్పుకున్న ప్రభుదేవా

    By Srikanya
    |

    తెలుగు సూపర్‌హిట్ ఫిల్మ్ 'విక్రమార్కుడు' చిత్రంకు రీమేక్‌గా ప్రభుదేవా రూపొందించిన చిత్రం 'రౌడీ రాథోర్'. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓపినింగ్స్ మాత్రం అదరిపోయే రేంజిలో తెచ్చుకుంది. ఇండియాలో దాదాపు పదిహేను కోట్లకు పైగా మొదటి రోజు కలెక్టు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ప్రభుదేవా ఈ చిత్రం ఒరిజనల్ దర్శకుడు రాజమౌళికి కృతజ్ఠతలు చెప్పుకున్నారు.

    ప్రభేదేవా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ... మొదటిగా నేను ఎస్.ఎస్.రాజమౌళి సార్ కు ధాంక్స్ చెప్పుకోవాలి. ఆయన ఒరిజనల్ విక్రమార్కుడు చేసారు. తెలుగులో తీసిన ఈ చిత్రం మాస్ మూవి కి కావల్సిన దినుసలన్నిటితో కలిసి తయారైంది. అది ఫెరఫెక్ట్ ఎంటర్టైనర్. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇండియన్ ఆడియన్స్ కు ఈ చిత్రం కనెక్టు అవుతుంది అన్నారు.

    బాలీవుడ్ ట్రేడ్ ఎనాలిటిస్ట్... తరుణ్ ఆదర్శ్ ఈ చిత్రం కలెక్షన్స్ పై ట్వీట్ చేస్తూ...'రౌడీ రాథోర్'..ఇండియాలో శుక్రవారం నెట్ 15.10 కోట్లు వసూలు చేసింది. బిగ్గెస్ట్ నాన్ హాలిడే ఫ్రైడే ఓపినర్ ..అవుట్ స్టాండింగ్ అని ట్వీట్ చేసారు. అయితే అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా కి ఉన్న మార్కెట్..బి,సి సెంటర్ల వద్ద వీరిద్దరికి ఉన్న క్రేజ్ ని తక్కువ అంచనావేయలేం అంటున్నారు. అందులోనూ చాలా కాలం గ్యాప్ తర్వాత అక్షయ్ కుమార్ ఇలా యాక్షన్ చిత్రంలో కనిపించటం కూడా భాక్సాఫీస్ ని ఆనందపరుస్తోంది.

    ఈ చిత్రంలో జింతాకా..పాటకు గానూ సౌత్ సూపర్ స్టార్ హీరో తీసుకున్నారు. తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్. అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న 'రౌడీ రాథోర్'లో ఓ పాటలో అతను స్పెషల్ అప్పీరెన్స్‌గా నటించాడు. ముంబైలోని ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించిన ఈ పాటలో రెండు రోజుల పాటు పాల్గొన్న విజయ్ ఉచితంగానే నటించారు. నిర్మాతలు రెమ్యునేషన్ చెల్లించడానికి సిద్ధమైనా విజయ్ దాన్ని సున్నితంగా తోసిపుచ్చి వార్తల్లో కెక్కాడు.

    ఇక ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఓ రేంజి బిజినెస్ జరిగిందని సమాచారం. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్పినట్లు చెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేసింది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా చాలా రోజులు పాటు స్క్రిప్టు పై కసరత్తులు చేసి తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.

    English summary
    Prabhu Deva thanked Rajamouli for Rowdy Rathore's success in an interview. He said: "First and foremost I would like to thank SS Rajamouli sir. He made the original, Vikramarkudu in Telugu and it had all essential items required for a mass movie. It is a perfect entertainer that will work worldwide with the Indian audiences."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X