»   » నిధి కోసం ప్రభుదేవా, హన్సిక వేట.. మార్చి 23న గులేబకావళి

నిధి కోసం ప్రభుదేవా, హన్సిక వేట.. మార్చి 23న గులేబకావళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అక్కడ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెల 23న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది.

Prabudeva, Hansika's Gulaebakhavali set release on March 23rd

ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు నేటివిటికి దగ్గరగా వుంటుంది. యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. ఇండియాన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా వుంటుంది అని తెలిపారు.

Prabudeva, Hansika's Gulaebakhavali set release on March 23rd

ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్వకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

Prabudeva, Hansika's Gulaebakhavali set release on March 23rd
English summary
Gulaebaghavali is a 2018 Tamil action comedy film, written and directed by Kalyaan. The film features Prabhu Deva and Hansika Motwani in the leading roles, with Revathi, Ramdoss and Yogi Babu among others portraying supporting roles. Featuring music by Vivek–Mervin and cinematography by Anandakumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu