»   » టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య : పావనితో సంబంధంపై శ్రవణ్ స్పందన!

టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య : పావనితో సంబంధంపై శ్రవణ్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడం తెలుగు టీవీ రంగంలో సంచలనంగా మారింది. రాత్రి జరిగిన చిన్న వాదనతో అలకబూనిన ప్రదీప్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య పావని మీడియాకు తెలిపారు.

అయితే ప్రదీప్ ఆత్మహత్య వెనక పావనిపై అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. శ్రవణ్ అనే వ్యక్తితో పావని చనువుగా ఉండటం, అతడితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడం వల్లనే ప్రదీప్-పావని మధ్య రాత్రి గొడవ జరిగిందని, ఈ క్రమంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం మొదలైంది.

 పావని అన్నయ్యా? స్నేహితుడా?

పావని అన్నయ్యా? స్నేహితుడా?

శ్రవణ్ తన అన్నయ్య అని పావని మీడియాతో, పోలీసులకు వెల్లడించింది. అయితే శ్రవణ్ పావని అన్నయయ కాదని, పావని స్నేహితుడేనని ప్రదీప్ సన్నిహితులు చెబుతున్నారు. దుబాయ్ నుంచి నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చాడని, అప్పటి నుంచి ప్రదీప్ ఇంట్లోనే అతడు మకాం వేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

స్పందించిన శ్రవణ్

స్పందించిన శ్రవణ్

మీడియాలో జరుగుతున్న ప్రచారంపై శ్రవణ్ స్పందిస్తూ పావనికి, తనకు మ‌ధ్య అన్నాచెల్లెళ్ల సంబంధం మాత్ర‌మే ఉంద‌ని తెలిపాడు. తాను ఓ అన్న‌ స్థానంలో ఉండి పావ‌నికి పెళ్లి చేశాన‌ని శ్రావణ్ అన్నాడు. పావ‌నికి అన్న‌య్య పొజిష‌న్‌లో ఉంటూ... వారి ఫ్యామిలీ మెంబ‌ర్‌గా మారిపోయానని అన్నాడు.

అది మామూలు గొడవే

అది మామూలు గొడవే

ప్రదీప్ ఆత్మహత్యకు ముందు రాత్రి ప్రదీప్-పావని మధ్య జరిగింది మామూలు గొడవే అని శ్రవణ్ తెలిపారు. ప్ర‌దీప్ కూడా త‌న‌తో చాలా క్లోజ్‌గా ఉండేవాడ‌ని, సినిమాల‌కు తాము క‌లిసే వెళ్లేవారమ‌ని చెప్పుకొచ్చాడు. పావ‌ని త‌న‌తో తీసుకున్న ఫొటోను మొబైల్‌లో ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా పెట్టుకోవ‌డం వ‌ల్లే గొడ‌వ చెల‌రేగింద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌ను శ్రవణ్ తోసిపుచ్చాడు.

ప్రదీప్ మరణంపై అనేక అనుమానాలు

ప్రదీప్ మరణంపై అనేక అనుమానాలు

అయితే ప్రదీప్ ఆత్మహత్యపై అతడి సన్నిహితులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పావనితో గొడవతో ప్రదీప్ బాటిల్‌తో తల పగలగొట్టుకున్నాడని, గాజు ముక్కలు కనిపించకుండా పనిమనిషిని పిలిపించి పావని క్లీన్ చేయించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు అద్దం పగలగొట్టగా చేతికి అంటుకున్న రక్తపు మరకలను కూడా పావనియే తుడిచేసిందని అంటున్నారు.

సూసైడ్ నోట్

సూసైడ్ నోట్

ప్రదీప్ ఆత్మహత్యకు సంబంధించి సూసైడ్ నోట్ కూడా కనిపించక పోవడం, అనేక అనుమానాస్పద విషయాలు ఉండటంతో పోలీసులు ఈ కేసును చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. త్వరలో ప్రదీప్ మరణం వెనక మిస్టరీ వీడనుంది.

మంచం కిందకి మృతదేహం ఎలా వచ్చింది?

మంచం కిందకి మృతదేహం ఎలా వచ్చింది?

మంచం క్రిందకి మతదేహం ఉండటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Sravan, a common friend of TV actors, Pradeep and Pavani, spoke to media, after police interrogation, in connection with Pradeep's suicide. He said that Pavani is like my sister.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu