»   » దుమ్మురేపుతోంది: క్రికెటర్ ప్రఙ్ఞాన్ ఓజా, బాహుబలి 2 డబ్‌స్మాష్ (వీడియో)

దుమ్మురేపుతోంది: క్రికెటర్ ప్రఙ్ఞాన్ ఓజా, బాహుబలి 2 డబ్‌స్మాష్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొద్ది రోజులుగా బాహుబలి మానియా జనాలలో మరింత పెరిగింది.విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్‌1 సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. భాషకతీతంగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఒప్పించడంలో దర్శకుడు రాజమౌళి బాహుబలిని తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యారు.

బాహుబలి 2

బాహుబలి 2

2015లో వచ్చిన బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా సినీ అభిమానులను ఒక్కటి చేసింది. ఊహలకు అందకుండా రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. బాహుబలి 1 చూసిన వారికి, చూడని వారికి బాహుబలి 2 చూడాలనే తపన మొదలైంది. ఈ మానియా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ రాష్ట్రాల్లో కూడా జోరుగా కనిపిస్తున్నది.

బాహుబలి సిరీస్‌లో

బాహుబలి సిరీస్‌లో

బాహుబలి సిరీస్‌లో బాహుబలి, భళ్లాలదేవ, శివగామి, కట్టప్ప లాంటి పాత్రలను దర్శకుడు రాజమౌళి మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అద్భుతమైన సెట్టింగులు, హంగులు, టెక్నాలజీ లాంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. అవే బాహుబలి చిత్రానికి బలమైన అంశాలుగా మారాయి. ఇలాంటి అంశాలన్నే భారీ కలెక్షన్లు సాధించడానికి దోహదపడుతున్నాయి.

బాహుబలి ది కన్‌క్లూజన్

బాహుబలి ది కన్‌క్లూజన్

ఈ క్రమంలో ఎవరికి నచ్చినట్టు వారు తమ స్టైల్ లో బాహుబలి చిత్రంపై అభిమానాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. సామాన్యులూ, సెలబ్రిటీలూ అనే తేడా లేకుండా అందరిదీ ఒకే మాట "బాహుబలి". బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాపై ట్విట్టర్ల్‌లో కామెంట్ల వరద ఉప్పొంగుతున్నది.

సందేశాలతో పోటెత్తారు

సందేశాలతో పోటెత్తారు

బాహుబలి 2 సినిమా చూసిన తర్వాత నెటిజన్లు తమ సందేశాలతో పోటెత్తారు. స్టూడెంట్స్, ఉద్యోగుల నుంచి సినీ నటుల వరకు తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి2పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలికి సినిమా నటులు కూడా అభిమానులుగా మారి ప్రత్యేక షోలకు క్యూ కట్టడం విశేషం.

ప్రజ్ఞాన్ ఓజా

బాహుబలిపై స్పందించిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్, మంచు మనోజ్, అఖిల్, వెన్నెల కిషోర్ తదితరులు ఉన్నారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా బాహుబలి ది కంక్లూజన్ చిత్రంలో ప్రభాస్ చెప్పే డైలాగ్ కి డబ్ స్మాష్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. బాహుబలి ది కంక్లూజన్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే.

English summary
Cricketer Pragyan Ojha put a Dub smash video with Bahubali 2 dialogue is now gone viral on social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu