»   » జూ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన సూపర్ స్టార్...!?

జూ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన సూపర్ స్టార్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, కాజల్, సమంత, ముఖ్య తారలుగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన బృందావనం చిత్రం ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్బంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...బృందావనం సినిమా విజయం సాధించడంలో తొలి ఘనత డైరెక్టర్ వంశీకే దక్కుతుంది. మంచి అభిరుచి ఉన్న, విలువలు ఉన్న సినిమాలు తియ్యాలన్న పట్టుదల ఉన్న నిర్మాత దిల్ రాజు'బృందావనం"తో దాన్ని రుజువు చేశారు. నేను ఐదు భాషల్లో 250 పైగా సినిమాల్లో చేశా. ఎంతోమంది హీరోలతో పనిచేశా. తారక్ తో నటించేప్పుడు పెద్ద హీరోతోనే లేదంటే ఓ స్టార్ తోనో పనిచేస్తున్నట్టు ఉండదు. ఒక నటుడితో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. 'నావైపు ఎవరూ వేలెత్తి చూపకూడదు" అనే తపన ఆయనలో కనిపిస్తుంది" అని ప్రకాష్ రాజ్ జూ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu