»   »  తెర వెనక ఏముందో ఎప్పుడు తేలుతుంది??? ఇరుముగన్ "హిజ్రా" వివాదం లో ప్రకాశ్ రాజ్.. అవునని ఒకరూ కాదని

తెర వెనక ఏముందో ఎప్పుడు తేలుతుంది??? ఇరుముగన్ "హిజ్రా" వివాదం లో ప్రకాశ్ రాజ్.. అవునని ఒకరూ కాదని

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్తదనం కోసం ప్రయత్నించే కథానాయకుల్లో విక్రమ్‌ ముందు వరుసలో ఉంటారు. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి నటనతో అభిమానులను మెప్పించారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముగన్‌'. తెలుగులో 'ఇంకొకడు' పేరుతో విడుదల కానుంది.

నయనతార, నిత్యామేనన్‌ కథానాయికలు. ఈ చిత్రంలో అఖిలన్‌, లవ్‌ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్‌ కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన చిత్ర ట్రైలర్‌ను చూస్తే విక్రమ్‌ సినిమాపై అంచనాలను మరోసారి పెంచేసింది. లవ్‌ పాత్రలో కనిపించిన విక్రమ్‌ను చూస్తే నటనలో ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని నిరూపించేలా ఉంది.

ఈ చిత్రానికి హ్యారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్‌లో 'ఇంకొకడు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్న విక్రమ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ కొన్ని వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.... ఒకప్పుడు తాను చేసిన పనే ఇప్పుడు విక్రమ్ చేయటం తప్పంటున్నాడు ప్రకాశ్ రాజ్....ఇంతకీ విక్రమ్ చేసిన తప్పేమిటి? ప్రకాశ్ రాజ్ ఎందుకలా విమర్శించాడూ అంటే...

తెలుగులో ‘ఇంకొకడు':

తెలుగులో ‘ఇంకొకడు':

ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముగన్‌'. తెలుగులో ‘ఇంకొకడు' పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో విక్ర‌మ్ తొలిసారిగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

క‌ష్ట‌మైన పాత్ర:

క‌ష్ట‌మైన పాత్ర:

న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ లు హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఇందులో విక్ర‌మ్ చేస్తున్న రెండు పాత్ర‌ల్లో ఒక‌టి ఇప్ప‌టివ‌రుకూ త‌న కెరీర్ లోనే అత్యంత క‌ష్ట‌మైన పాత్ర అంటున్నాడు. దీనికి కార‌ణం ఇది హిజ్రా పాత్ర కావ‌డ‌మే.

తొలిసారిగా :

తొలిసారిగా :

హిజ్రాపాత్ర‌లో తొలిసారిగా క‌నిపించ‌బోతున్నాడు విక్ర‌మ్. ఈ హీరో న‌టించిన గ‌త చిత్రాలు తీవ్రంగా నిరాశ ప‌ర‌చ‌డంతో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఈ సినిమా చేస్తున్నాడు విక్ర‌మ్.

ట్రాన్స్‌జెండర్ పాత్ర :

ట్రాన్స్‌జెండర్ పాత్ర :

రెండు పాత్రలు భిన్న పార్శాల్లో సాగుతాయని, ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం చాలా కష్టపడాల్సివస్తుందని, ఈ పాత్ర తీరుతెన్నుల, ఆహార్యం కోసం చాలా పరిశోధన చేశానని, ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోని నటించాల్సివస్తుందని విక్రమ్ తెలిపారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఏ పాత్ర కోసం ఇంతలా కష్టపడలేదని చెప్పారు.

వివాదాస్పదమైంది:

వివాదాస్పదమైంది:

హిజ్రాగా విక్రమ్ అవతారం: ఆల్రెడీ ‘ఐ' సినిమాలో విలన్ గా ఓ హిజ్రాను చూపించడం వివాదాస్పదమైంది. ఐతే ఈసారి విక్రమ్ స్వయంగా హిజ్రా వేషం వేశాడు. అది కూడా విలన్ గా.

ఇంకొక్కడు:

ఇంకొక్కడు:

తన కొత్త సినిమా ఇరు ముగన్ (తెలుగులో ఇంకొక్కడు) విక్రమ్ హీరోగానే కాక ‘లవ్' అనే విలన్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్లో హిజ్రాగా విక్రమ్ అవతారం.. అతడి బాడీ లాంగ్వేజ్ చూసి జనాలకు దిమ్మదిరిగిపోయింది.

హిజ్రాలను విలన్లుగా:

హిజ్రాలను విలన్లుగా:

ఈ పాత్ర సినిమా మీద జనాల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఐతే ఈ మధ్య హిజ్రాలను విలన్లుగా.. కమెడియన్లుగా చూపిస్తుండటంపై ఆ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

విమర్శలు:

విమర్శలు:

ఈ పాత్రల్ని జుగుప్సాకరంగా చూపిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగతా దివ్యాంగుల లాగే తమ హక్కుల కోసం కూడావాళ్ళు పోరాడుతున్నారు.. ఈ పరిస్థితుల్లో ఒక విలన్ ని హిజ్రా గా చూపించటం వివాదాస్పదమైంది..

మనోభావాలు:

మనోభావాలు:

తాజాగా ప్రకాష్ రాజ్ లాంటి పేరున్న నటుడు ఈ పాత్రల విషయంలో అసంతృప్తి వెళ్లగక్కాడు. సమాజంలోని ఓ వర్గం మనోభావాల్ని దెబ్బ తినేలా ఇలాంటి పాత్రలు రూపొందించడం తప్పని అన్నాడు.

హిజ్రా విలన్ :

హిజ్రా విలన్ :

ఒకప్పుడు తాను కూడా ఇలాంటి పాత్ర చేయాల్సి వచ్చిందని.. కానీ ఇప్పుడు మాత్రం అది తప్పని అనిపిస్తోందని ప్రకాష్ అన్నాడు. ‘‘అప్పట్లో నేను అప్పు సినిమాలో హిజ్రా విలన్ పాత్ర చేశాను. ఆ పాత్రను అలా ప్రొజెక్ట్ చేయాల్సింది కాదని అప్పట్లో చెప్పాను.

తప్పనిపిస్తోంది:

తప్పనిపిస్తోంది:

ఐతే ఇప్పుడు నేను మరింత సెన్సిటివ్ గా మారాను. అలాంటి పాత్రలు చేయడం తప్పనిపిస్తోంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఎదిగాను. పరిణతి సాధించాను. ఇలాంటి పాత్రలు చేయడం కరెక్ట్ కాదు.

బాధ్యత ఉండాలి:

బాధ్యత ఉండాలి:

సినిమా రూపకర్తలు సమాజంపై చాలా ప్రభావం చూపిస్తారు. తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. కానీ అందులో బాధ్యత ఉండాలి. ఇలాంటి పాత్రలు సమాజం వేరే కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తాయి'' అని ప్రకాష్ అన్నాడు.

దర్శకుడు

దర్శకుడు

అయితే దీనిపై దర్శకుడు ఆనంద్ శంకర్మాత్రం హిజ్రాను కొన్ని ప్రయోగాల ద్వారా ఆడ లేదా మగ గా మార్చ వచ్చన్న అంశాన్ని మాత్రమే ఈ సినిమాలొ చర్చించాం తప్ప విక్రం హిజ్రా కాదు అంటూ చెబుతున్నదు.

అంతే కాదు

అంతే కాదు

అంతే కాదు ఈరెండో పాత్ర వైవిధ్యభరితంగా, ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఉంటుందట. ఈ గెటప్ విక్రమ్ అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుందన్నారు.

English summary
"Freedom of expression comes with responsibility. As creative people, we have to admit that we have influenced people wrongly. Nobody can ignore the power of cinema" actor prakash raj about a charecter of a Transgender that Vikram playing in Irumugan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu