»   » ‘శౌర్య’ రివ్యూలపై మండిపడ్డ ప్రకాష్ రాజ్ (వీడియో)

‘శౌర్య’ రివ్యూలపై మండిపడ్డ ప్రకాష్ రాజ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బేబి త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్ పై మంచు మనోజ్, రెజీనా జంటగా నటించిన చిత్రం 'శౌర్య'. కె.దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 4న సినిమా రిలీజైంది. అయితే ఈ సినిమా రివ్యూకు క్రిటిక్స్ యావరేజ్ రేటింగ్ ఇవ్వడంపై ప్రకాష్ రాజ్ మండి పడ్డారు. ఆయన ఏ మాట్లాడారో వీడియోలో చూడండి.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ 'మంచు మనోజ్ మంచి ఎనర్జీ యాక్టర్. ఏ క్యారెక్టర్ అయినా చేయగల నటుడు. దశరథ్ తో కలిసి డిఫరెంట్ గా చేసిన సినిమా. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లో చేసిన సినిమా. కొత్త ఎక్స్ పెరిమెంట్స్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేసినప్పుడే ఇంకా కొత్త సినిమాలు వస్తాయి. రివ్యూల రూపంలో మీ అభిప్రాయాన్ని జనాలపై రుద్దొద్దు అంటూ ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు' అన్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ 'మా కొత్త ప్రయత్నాన్ని అందరూ బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దశరథ్ గారికి థాంక్స్. నాన్నగారితో పనిచేసినప్పుడు ఎలా ఫీలయ్యానో ప్రకాష్ రాజ్ గారితో యాక్ట్ చేసేటప్పుడు అలానే ఫీలయ్యాను. ఇలాంటి చిత్రాన్ని ప్యాషన్ తో చేసిన శికుమార్ గారికి థాంక్స్'' అన్నారు.

దశరథ్ మాట్లాడుతూ 'కాన్సెప్ట్ బేస్ చేసుకుని కొత్తగా ఉండాలని చేసిన సినిమా. మిష్టర్ ఫర్ ఫెక్ట్ తర్వాత అంత మంచి పేరు వచ్చిన సినిమా. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా' అన్నారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ''తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్ సీస్ లో కూడా సినిమాను విడుదల చేశాం. అన్నీ చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రకాష్ రాజ్ గారు తక్కువ రెమ్యునరేష్ కే వర్క్ చేశారు. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి రిలీజ్ చేశాం. సినిమాను హిట్ చేసిన ఆడియెన్స్ కు థాంక్స్'' అన్నారు.

English summary
Prakash Raj Bursts Out on Reviewers in a recent Press Meet of Shourya Telugu movie ft. Manchu Manoj, Regina Cassandra, Prakash Raj and Brahmanandam. Directed by K Dasaradh. Music composed by K Veda. Produced by Malkapuram Shivakumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu