»   »  ప్చ్...ప్రకాష్ రాజ్ మళ్లీ గొడవపడ్డాడు

ప్చ్...ప్రకాష్ రాజ్ మళ్లీ గొడవపడ్డాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్యనే 'ఆగడు' వివాదం నుండి బయిటపడి,మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతున్న నటుడు ప్రకాష్ రాజ్. అయితే ఆయన తాజాగా మరో గొడవ ద్వారా మీడియాకి ఎక్కారు. అయితే ఈ సారి ఓ జూనియర్ ఆర్టిస్టుతో గొడవ పడినట్లు సమాచారం. దాదాపు కొట్టుకునే స్ధితికి వెళ్లిన ఈ గొడవ చిన్న విషయంతో మొదలైంది. అయితే ఈ సారి గొడవ జరిగింది సినిమా సెట్ లో కాదు...ప్లైట్ లో కావటం విశేషం.

వివరాల్లోకి వెళ్లితే... నిన్న(బుధవారం) రాత్రి ఏడున్నర గంటలకు ప్రకాష్ రాజ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానంలో చెన్నై వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. తన సీట్లో కూర్చున్న తర్వాత పక్కనే ఉన్న ప్రయాణికుడు ఫొటో తీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది ఇద్దరూ కోపంతో ఊగిపోతూ ఒకరిపై ఒకరు చేయిచేసుకునేంతవరకూ వెళ్లింది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంత పరిచే వరకూ అది ఆగలేదు. తర్వాత విమానం బయలుదేరింది.

 Prakash Raj gets into verbal brawl at RGI Airport

విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ త్వరలో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రంతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రకాష్ రాజ్ ఈ చిత్రంపై మంచి ధీమాగా ఉన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాను తెలుగు తమిళ మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్నాడు.

ఇది రెండు జంటల చుట్టూ తిరిగే కథ అందులో ప్రకాష్ రాజ్ - స్నేహ ఒక జంటగా, మరొక జంట కోసమే అన్వేషణ అజరుగుతోంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, స్నేహ, ఊర్వశి, సామ్యూక్తా హోర్నాడ్, ఎస్.పి బాలసుబ్రమణ్యం మరియు సిహి కహి చంద్రు ప్రధానపాత్రధారులు. ఈ సినిమా తాను అనుకున్నట్టే అందంగా తెరకెక్కింది అని ప్రకాష్ రాజ్ ఆనందంగా వున్నాడు. 

English summary

 Prakash Raj reportedly caused a flutter at the RGI Airport when he had a verbal duel with another passenger on Wednesday night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu