twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తలలు నరికితే, జీఎస్టీ కట్ చేస్తారా?: ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శ, "న్యూడ్" పై కూడా స్పందించాడు

    దీపిక పదుకొణె ముక్కును శూర్పణఖ తరహాలో కత్తిరిస్తామంటూ రాజ్‌పుట్‌ కర్ణి సంఘం చేసిన హెచ్చరికలను ప్రకాష్ రాజ్ ఖండించారు. దీన్ని సమాజంలో పెరిగిపోతున్న అసహనంగానే పరిగణించాలన్నారు.

    |

    Recommended Video

    తలలు నరికితే, జీఎస్టీ కట్ చేస్తారా? ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శ..!

    సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న వివాదాస్పద "పద్మావతి" చిత్రం హీరోయిన్ దీపికా పదుకొణె‌కు సినీ నటుడు ప్రకాష్ రాజ్ బాసటగా నిలిచారు. దీపిక పదుకొణె ముక్కును శూర్పణఖ తరహాలో కత్తిరిస్తామంటూ రాజ్‌పుట్‌ కర్ణి సంఘం చేసిన హెచ్చరికలను ఖండించారు. దీన్ని సమాజంలో పెరిగిపోతున్న అసహనంగానే పరిగణించాలన్నారు.

    విధ్వంసం సృష్టిస్తాం

    విధ్వంసం సృష్టిస్తాం

    సినిమా విడుదల చేస్తే విధ్వంసం సృష్టిస్తామని కర్ణిసేన చేస్తున్న వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. కళాకారులపై దాడులకు పాల్పడతామని చేస్తున్న హెచ్చరికలు ఆందోళనకరమని ట్విట్ చేశాడు. పద్మావతి షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండే వివాదాలు తార స్థాయికి చేరాయి.

    సీరియస్ అయ్యింది

    సీరియస్ అయ్యింది

    మళ్లీ తగ్గిపోతుందిలే అని అందరు అనుకున్నారు. కానీ అది ఇప్పుడు చాలా సీరియస్ అయ్యింది. మొన్న ఒక వ్యక్తి హీరోయిన్ - డైరెక్టర్స్ తలలను నరికేస్తే రూ.5 కోట్లు ఇస్తామని చెప్పాడు. ఇక రీసెంట్ గా మరొక వ్యక్తి ఏకంగా రూ.10 కోట్లను ఇస్తామని చెప్పాడు.

     దీపిక, సంజయ్ ల తలలను నరికేస్తే

    దీపిక, సంజయ్ ల తలలను నరికేస్తే

    అతను ఎవరో కాదు హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో-ఆర్డినేటర్ సూరజ్ పాల్. దీపిక-సంజయ్‌ల తలలను నరికేస్తే రూ.10 కోట్ల నజరానా ఇస్తామని చెప్పాడు. అంతే కాకుండా వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. దీంతో బాలీవుడ్ తారలు ఈ విషయంపై చాలా సీరియస్ అవుతున్నారు.

    ప్రకాష్ రాజ్

    ప్రకాష్ రాజ్

    రీసెంట్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మరోసారి తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశాడు. ఫైనల్ గా ఎలక్షన్స్ తర్వాత సినిమా రిలీజ్ కాబోతోంది. అంటూ.. డైరెక్టర్ - యాక్టర్ శిరచ్చేదనంకు మొన్న ఒకరు రూ.5 కోట్లు ప్రకటిస్తే ఈ రోజు మరొకరు రూ.10 కోట్లు ఇస్తామని అంటున్నారు.

     రివార్డ్ మనీ పెరుగుతోంది

    రివార్డ్ మనీ పెరుగుతోంది

    రోజు రోజుకి రివార్డ్ మనీ పెరుగుతోందని.. కాని డీమానిటైజేషన్ తరువాత అంత డబ్బు ఎక్కడిది.. దానిలో జిఎస్స్టీ కట్ చేస్తారా అంటూ ఆయన వేసిన సెటైర్ అదిరిపోయింది. మరోవైపు మరాఠీ సినిమా న్యూడ్, మలయాళ సినిమా ఎస్ దుర్గ సినిమాలను IIFI వేడుకల ప్రదర్శన నుంచి తొలగించటాన్ని అయన తీవ్రంగా ఖండించారు.

     ఈ నిర్ణయం సరికాదు

    ఈ నిర్ణయం సరికాదు

    సినిమాల పేర్లను ఆధారంగా చేసుకొని కేంద్ర మంత్రిత్వశాఖ తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని అయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుందని ప్రకాష్ రాజ్ విమర్శించారు. ఓ చానల్ తో మాట్లాడుతూ....దేశంలో ఆరోగ్యకరమైన విధానం నాశనమవుతుందని అన్నారు.

    "తలలు నరకటానికి" బహుమతులు

    విమర్శను ప్రభుత్వం భరించలేకపోతుందని అన్నాడు. తాను ఏపార్టీకీ మద్దతు కాదు అని చెబుతూనే.., ఇలాంటి విషయాల్లో తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతూనే ఉన్నాడు ప్రకాశ్ రాజ్. ఒక్క సినిమా విషయం లో ఇంత దుమరం రేగటం, అదీ అసలు విడుదల కాకుండానే "తలలు నరకటానికి" బహుమతులు ప్రకటించటం మాత్రం ధారుణం...

    English summary
    In a recent post Prakash Raj addressed two issues that have made headlines and become national news. One, Padmavati controversy and the other IIFI controversy about Sexy Durga and Nude being ousted from the festival by the I&B ministry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X