»   » 'ఆకాశమంత' తో అరవై లక్షలు నష్టం: ప్రకాష్ రాజ్

'ఆకాశమంత' తో అరవై లక్షలు నష్టం: ప్రకాష్ రాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రిష, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చిన ఆకాశమంత చిత్రం తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రంపై ఉన్న మమకారంతో ప్రకాష్ రాజ్..కన్నడంలో 'నాను నన్న కనసు' పేరుతో స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేసారు. అయితే చిత్రానికి మంచి టాక్ వచ్చింది కానీ..కలెక్షన్స్ తెచ్చుకోలేకపోయింది. ఈ చిత్రం 125 రోజులు బిగ్ సినిమాస్, ఐనాక్స్ ల లో పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..నేను ఈ చిత్రం పేరు చెప్పి అరవై లక్షలు పోగొట్టుకున్నాను. అయితే ఓ దర్సకుడుగా మంచి సినిమా తీసానన్న తృప్తి మిగిల్చింది. నిర్మాతగా నష్టపోయా..దర్శకుడుగా గెలిచా అన్నారు. అయితే త్వరలోనే మరో చిత్రం డైరక్ట్ చేస్తానని, అందుకోసం కథను వెతుకుతున్నానని అన్నారు. ఇక ప్రస్తుతం ప్రకాష్ రాజ్...కన్నడంలో నిర్మాతగా మరో తెలుగు రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. అది యేలేటి చంద్రశేఖర్ తొలి చిత్రం ఐతే. ఈ చిత్రాన్ని అకస్మాత్ అనే టైటిల్ తో రీమేక్ చేయాలని ప్రకాష్ రాజ్ ప్లాన్ చేస్తున్నారు. దయాల్ పద్మనాభన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు. ఈ విషయం చెపుతూ..నేను కేవలం నటిస్తూ, నిర్మాతగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాను. అంతే తప్ప డైరక్ట్ చేయను. త్వరలోనే ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది అన్నారు. మరి ఈ చిత్రం అన్నా ఆయనకు నిర్మాతగా సాటిస్ పేక్షన్ కలిగిస్తుందని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu