»   » మహానటిలో: మహానటుడుగా ప్రకాశ్ రాజ్

మహానటిలో: మహానటుడుగా ప్రకాశ్ రాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు వారి గుండెల్లో ఇప్పటికి చిరస్థాయిగా నిలచిన మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో సినిమా తీస్తానని నాగ అశ్విన్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాకి సంబంధించి రోజుకొక వార్త ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తూనే ఉంది. ఇప్పటికే మహా నటి ప్రాజెక్టుకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలుస్తుండగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది టీం.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇక ఫిలిం నగర్ సమాచారం ప్రకారం , ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయనున్నట్టు తెలుస్తుంది తెలుగు సినీ నటులలో మహానటులు అనదగ్గ అతి కొద్దిమందిలో ఎస్వీ రంగారావు ఒకరు.

Prakash Raj in 'Mahanati' Savitri's Biopic

ఏ తరహా పాత్రనైనా సరే తనదైన శైలి ముద్రతో రక్తి కట్టించగల ప్రతిభాశాలి ఆయన. అలాంటి ఎస్వీఆర్ పాత్రను ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 'మహానటి' పేరిట సావిత్రి జీవితకథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో ఎస్వీఆర్ కూడా కొన్ని సన్నివేశాలలో కనిపిస్తారట. దాంతో ఎంతోమందిని పరిశీలించిన మీదట ప్రకాశ్ రాజ్ ని ఎంచుకుని ఆయనను సంప్రదిస్తున్నట్టు, అందుకు ఆయన కూడా సుముఖంగా వున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్, జెమినీ గణేషన్ గా దుల్ఖర్ సల్మాన్ నటిస్తుండగా.. సమంత మరో కీలక పాత్ర పోషిస్తోంది.

English summary
Makers have approached Prakash Raj for two crucial role. However, It's too early to say if he signed the biopic or not.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu