»   » ప్రచారం కూడా ఉండాలి కదా..! చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్ ప్రకాశ్ రాజూ ..!

ప్రచారం కూడా ఉండాలి కదా..! చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్ ప్రకాశ్ రాజూ ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాతగా, దర్శకుడిగానూ అద్భుతమైన ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. 'ఆకాశమంత', 'ధోని', 'ఉలవచారు బిర్యాని', 'గౌరవం' లాంటి పలు అభిరుచి గల సినిమాలను రూపొందించి దర్శక నిర్మాతగా ప్రకాశ్, తనదైన బ్రాండ్ సృష్టించారు. తాజాగా ఆయన దర్శకత్వంలో 'మన ఊరి రామాయణం' అన్న టైటిల్‌తో ఓ సినిమా రూపొందింది. నవంబర్ నెలాఖర్లో మొదలైన నెలరోజుల్లోనే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దోని, ఉల‌చారు బిర్యాని స‌హా మ‌న‌సుకు న‌చ్చిన చిత్రాల‌ను డైరెక్ష‌న్‌తో పాటు నిర్మించిన ప్ర‌కాష్ రాజ్ ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ‌స్ట్ కాపీ పిక్చ‌ర్స్‌ పై 'మ‌న ఊరి రామాయ‌ణం' అనే చిత్రాన్ని నిర్మిస్తూ తెర‌కెక్కించాడు.

ఓపెనింగ్స్ మీదే సినిమా ఫ‌లితాలు ఆధార‌ప‌డిన ఈ రోజుల్లో సినిమాకు హైప్ తీసుకురావ‌డం కీల‌కంగా మారింది. ఐతే ప్ర‌కాష్ రాజ్ ఇలాంటివేమీ చేయ‌కుండా సైలెంటుగా సినిమా పూర్తి చేసేశాడు. 'మ‌న ఊరి రామాయ‌ణం' పేరుతో కొంత కాలం కింద‌ట ప్ర‌కాష్ రాజ్ స్వీయ నిర్మాణం, ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం టైటిల్ లోగో త‌ప్ప ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషం బ‌య‌టికి రాలేదు. కానీ సినిమా పూర్త‌యిపోయింది. రీరికార్డింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా అయిపోయాయి.సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాక రిలీజ్ డేట్ మీద ఓక క్లారిటీకి వస్తామంటు ట్విట్ట‌ర్లో వెల్ల‌డించాడు ప్ర‌కాష్ రాజ్‌.

Prakash Raj Mana Oori Ramayanam ready to release

ఎంత ప్రకాశ్ రాజ్ మంచి సినిమాలు తీస్తాడు అని జనానికి తెలిసినా కనీస ప్రచారం చేయక పోతే ఎలా?? కనీసం సినిమా వస్తున్న సంగతి అయినా సరిగా తెలియాలి కదా. అసలే కట్ట్గట్టుకొని అగ్ర హీరోలందరూ వచ్చేస్తున్నారు... ఇలాంటి పరిస్థితుల్లో మినిమం ప్రమోషన్ కూడా చేయాలి... అయినా ఇదేమీ స్టార్లు న‌టిస్తున్న సినిమా కాదు. ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. కాబ‌ట్టి హైప్ దానంత‌ట‌దే రాదు. ఇక‌ముందైనా సినిమాను స‌రిగా ప్ర‌మోట్ చేసి జ‌నాల్లో ఆస‌క్తి పెంచుతాడేమో చూద్దాం ప్ర‌కాష్ రాజ్‌.

English summary
‘Mana Voori Ramayanam’ has completed its post-production works and is getting ready for censor. Prakash Raj will announce the release date after the censor formalities and will plan promotional activities accordingly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu