మహానటి: చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్

మహానటి మూవీలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ చిత్రంలో ఆయన నిర్మాత చక్రపాణి పాత్రలో నటించనున్నారు.

By Bojja Kumar

ప్రముఖ తెలుగు నటి సావిత్రి జీవితంపై 'మహానటి' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్.... సావిత్రిగా లీడ్ రోల్ చేస్తోంది. ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలిపింది. తెలుగు సినీపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు, విజయ వాహిని బేనర్ అధినేత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు.

Prakash Raj to play Chakrapani in Mahanati

తొలినాళ్లలో సావిత్రిలోని టాలెంట్ గుర్తించి, తన సినిమాల్లో నటిగా అవకాశం ఇచ్చిన నిర్మాతల్లో చక్రపాణి ఒకరు. సావిత్రి సినీ జీవితంలోని అతిముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ పాత్ర సినిమాలో కీలకంగా ఉండనున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారు.

ఈ చిత్రంలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బేనర్లో 'మహానటి' చిత్రం తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X