»   » టెర్రరిస్టుగా జీవిస్తున్న ప్రకాష్ రాజ్

టెర్రరిస్టుగా జీవిస్తున్న ప్రకాష్ రాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రకాష్ రాజ్ తాజాగా చేస్తున్న పయనం చిత్రంలో టెర్రరిస్టు లీడర్ గా కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఆయనే స్వయంగా తమిళంలో నిర్మిస్తున్న(తెలుగుకి దిల్ రాజు) ఈ చిత్రంలోని ఆ పాత్రలో లీనమై జీవిస్తున్నట్లు చెప్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ఆకాశమంతా ఫమ్ రాధామోహన్ డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ షూటింగ్ వివరాలు రాధామోహన్ తెలుపుతూ...మొదటి షెడ్యూల్ కులూ మనాలీ లో పూర్తయింది. ఇక రెండో షెడ్యూల్ రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతుంది. ఇక మూడో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక ఎయిర్ పోర్ట్ సెట్ లో జరుగుతుంది. ఓ ధ్రిల్లర్ గా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం కాందహార్ సంఘటన ఆదారంగా తెరకెక్కుతున్నట్లు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu