»   » సల్మాన్‌ ఖాన్ కేసు: ప్రకాష్ రాజ్ ప్రత్యేక ప్రార్ధన

సల్మాన్‌ ఖాన్ కేసు: ప్రకాష్ రాజ్ ప్రత్యేక ప్రార్ధన

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ కారు ప్రమాదం కేసుపై బుధవారం సెషన్స్‌ కోర్టు తీర్పు వెల్లడించనుందనే సంగతి తెలిసిందే. 13 ఏళ్ల క్రితం సల్మాన్‌ మద్యం సేవించి కారు నడుపుతూ ఓ బేకరీలోకి దూసుకెళ్లినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఈ కేసులో సల్మాన్‌ దోషిగా తేలితే పదేళ్ల పాటు జైలు శిక్షపడే అవకాశం ఉంది. అదే జరిగితే సల్మాన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపధ్యంలో సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసిన నటుడు ప్రకాష్ రాజ్...ఆయన బయిటపడాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రార్ధన చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ...

‘'" సల్మాన్ ఖాన్....నేను అతన్ని కలిసి ఉన్నప్పటి నుంచీ... అతను ఎవరికీ హాని చేయనివ్యక్తి... అతనిలో మంచితనం మూర్తిభవించి ఉంది..అతను బయిటపడాలని కోరుకుంటున్నా " అనే అర్దం వచ్చేలా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే...

2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ నుంచి తన ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో సల్మాన్ బయల్దేరాడు. బాంద్రాలోని ఒక బేకరీ ముందు పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి ఆ వాహనం దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. కేసేంటి: మొదట బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది.

కేవలం రెండేళ్ల గరిష్ట శిక్ష పడే అవకాశమున్న 'నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్' ఆరోపణల మీద సల్మాన్‌పై విచారణ జరిపిన ఆ కోర్టు... 2012లో పదేళ్ల గరిష్ట జైలుశిక్ష వేసేందుకు అవకాశమున్న 'ఐపీసీ 304 (2)(ఉద్దేశపూర్వకం కాని హత్య)' సెక్షన్ కిందకు మార్చి, విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. ఏయే సెక్షన్ల కింద కేసులు: ఐపీసీ సెక్షన్లు 304(2), 279, 337, 338, 427. మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్లు.

ప్రమాద సమయంలో సల్మాన్‌ఖాన్ స్వయంగా ఆ వాహనాన్ని నడుపుతున్నాడు. అప్పుడు ఆయన మద్యం మత్తులో ఉన్నాడు. హోటల్‌లో బకార్డి రమ్ తీసుకున్నట్లు సాక్ష్యాలున్నాయి. వేగంగా డ్రైవ్ చేయొద్దని తాను చెప్పినట్లు సల్మాన్ బాడీగార్డ్ రవీంద్ర పాటిల్(సాక్ష్యం ఇచ్చిన కొన్ని రోజుల తరువాత చనిపోయాడు) ఇచ్చిన సాక్ష్యం ఉంది. ఆ సమయంలో సల్మాన్ మద్యం మత్తులో ఉన్నాడని కూడా రవీంద్ర చెప్పాడు.

Prakash Raj prayers for Salman Khan

అయితే డిఫెన్స్ వాదన వేరే విధంగా ఉంది...ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తోంది సల్మాన్ కాదు.. ఆయన డ్రైవర్ అశోక్‌సింగ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అశోక్ కోర్టు ముందు ఒప్పుకున్నాడు. ప్రమాద సమయంలో సల్మాన్ తాగి లేడు. హోటల్‌లో కేవలం గ్లాస్ మంచినీళ్లు మాత్రమే తాగాడు.

ప్రాసిక్యూషన్ వాదిస్తున్నట్లు హోటల్ నుంచి గంటకు 90 కి.మీ.లవేగంతో వస్తే ప్రమాదస్థలికి రావడానికి 10 నిమిషాలే పడ్తుంది. కానీ హోటల్ నుంచి బయల్దేరిన అరగంట తర్వాతే ప్రమాదం జరిగింది. అయితే పోలీసులు వాహనం స్టీరింగ్ వీల్‌పై ఉన్న వేలిముద్రలను సేకరించలేదు.

సల్మాన్ ఖాన్(49) 'హిట్ అండ్ రన్' కేసులో నేడు తీర్పు వెలువడనుంది. సల్మాన్ అభిమానులు, సినీ ఇండస్ట్రీ, ఆ హీరోతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పును బుధవారం ఉదయం 11.15 గంటలకు ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే వెలువరించనున్నారు. దీంతో కోర్టు ఆవరణలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. లాయర్లు, మీడియా, కోర్టు సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. సల్మాన్ కి నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం. అయితే శిక్ష పడితే.. పై కోర్టుకు అపీల్‌కు వెళ్లొచ్చు.

శిక్షపడితే..సల్మాన్ ఖాన్ బిజినెస్ పరిస్థితేంటి

సల్మాన్ హీరోగా పలు సినిమాలు నిర్మితమవుతున్నాయి. కొన్ని సెట్స్‌పై ఉన్నాయి. కొన్ని చర్చల్లో ఉన్నాయి. మొత్తంమీద రూ. 200 కోట్ల ప్రాజెక్టులు ఆయనపై ఆధారపడి ఉన్నాయి. సల్మాన్ జైలుకెళ్తే ఆ ప్రాజెక్టుల పరిస్థితి నిలిచిపోయే అవకాశముంది.

English summary
‘’“#salman khan.Since I have met that harmless child n loads of goodness in him ..Wish n pray world considers that n pays him back for that too” tweeted Prakash Raj
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu