»   » ప్రకాష్‌రాజ్‌ ...పది లక్షలు దాటాడు

ప్రకాష్‌రాజ్‌ ...పది లక్షలు దాటాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prakash Raj
హైదరాబాద్ : సాధారణంగా ఫేస్‌ బుక్‌లో స్టార్‌ హీరోలదీ, హీరోయిన్లదే హవా. కొంతమంది హీరోయిన్స్ అయితే ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో టచ్‌లో ఉంటుంటారు. అందుకే 'లైక్‌'లు కొట్టేవారి సంఖ్య లక్షలు దాటేస్తుంటుంది. రాజమౌళి, త్రివిక్రమ్‌ లాంటి దర్శకులకు ఫేస్‌బుక్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. వీరితో ప్రకాష్‌రాజ్‌ ఏమాత్రం తీసిపోరు. ఈ జాతీయ ఉత్తమ నటుడిని ఫేస్‌బుక్‌ లైక్‌లు ఈమధ్యే పదిలక్షలు దాటేశాయి. తెలుగు, తమిళ, కన్నడల్లో ప్రకాష్‌రాజ్‌కు అభిమానులున్నారు. అందుకే ఫేస్‌బుక్‌లో ఈ స్థాయి ఆదరణ లభిస్తోంది.

''పదిలక్షల లైక్‌లు దాటినందుకు సంతోషం. ఇక ముందూ మన మధ్య బంధం ఇలాగే కొనసాగాలి'' ప్రకాష్‌రాజ్‌ సందేశం పంపారు. విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ త్వరలో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రంతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రకాష్ రాజ్ మలయాళంలో ఘన విజయం సాధించిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాను తెలుగు తమిళ మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్నాడు.

ఇది రెండు జంటల చుట్టూ తిరిగే కథ అందులో ప్రకాష్ రాజ్ - స్నేహ ఒక జంటగా, మరొక జంట కోసమే అన్వేషణ అజరుగుతోంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్న ఈ సినిమాకి సిరివెన్నెల సీతారమశాస్త్రి పాటలు రాయనున్నారు. మా ఆఖరి షెడ్యూల్ మైసూర్ లో మొదలైంది, అంతేకాక డిసెంబర్ 5నుండి క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలిపాడు

ప్రకాష్ రాజ్, స్నేహ, ఊర్వశి, సామ్యూక్తా హోర్నాడ్, ఎస్.పి బాలసుబ్రమణ్యం మరియు సిహి కహి చంద్రు ఈ సినిమాలో ప్రధానపాత్రధారులు. ఈ సినిమా తాను అనుకున్నట్టే అందంగా తెరకెక్కుతుంది అని ప్రకాష్ రాజ్ ఆనందంగా వున్నాడు. చాలా భాగం మైసూర్ లోనే చిత్రీకరణ జరిగింది

ఈ సినిమా మలయాళ 'సాల్ట్ ఎన్ పెప్పర్'కు రీమేక్. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని డ్యూయట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. తెలుగు వర్షన్ ను దిల్ రాజు పంపిణీ చెయ్యనున్నడు. ఇళయరాజా సంగీతదర్శకుడు. 2014మొదట్లో ఈ సినిమాను విడుదలచెయ్యనున్నారు .

English summary

 Prakash Tweeted: "Hiiiii. Reached a million likes thank you allllll for this .... So happy that I can keep in touch n communicate through this FB platform. Lets continue rocking. All your reactions Keep me grounded. Love this journey..."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu