»   » ప్రకాష్‌రాజ్‌...ఇలా నిజాలు చెప్తూ రిక్వెస్ట్ చేస్తాడని ఊహించం (వీడియో)

ప్రకాష్‌రాజ్‌...ఇలా నిజాలు చెప్తూ రిక్వెస్ట్ చేస్తాడని ఊహించం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే..ప్రకాష్ రాజ్ రిక్వెస్టింగ్ నా సినిమా చూడండి,కలెక్షన్స్ లేవు అంటూ చెప్పిన ఓ వీడియో. అది చూడగానే అయ్యో..ఈ సినిమా రిలీజైందా..చూడలేకపోయామే..ఓ సారి చూద్దాం అనే ఆలోచన కలుగుతోంది.

  సాధారణంగా ప్రకాష్ రాజ్ అనగానే మనకు ఓ ఆడపిల్ల తండ్రి, ఓ కర్కోటకమైన విలన్, కొడుకుని ఎంతగానో ప్రేమించే బొమ్మరిల్లు తండ్రి ఇలా ఎన్నో పాత్రలు మన కళ్ళ ముందు కనపడతాయి. అంతలా తన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రకాష్‌రాజ్‌. అయితే నటనతో పాటు ఆయన నిర్మాతగానూ, దర్శకుడుగానూ మారి వరస సినిమాలు తెరకెక్కించటం మొదలెట్టారు.


   Prakash Raj request fot his latest movie

  రీసెంట్ గా ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మనవూరి రామాయణం'. ప్రియమణి, పృథ్వీ, సత్య కీలక పాత్రధారులు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం చక్కటి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా 'మనవూరి రామాయణం'లాంటి చిత్రాలను ప్రోత్సహించాలని ప్రకాష్‌రాజ్‌.. ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.  ఆయనేమన్నారంటే.. 'కొన్ని నిజాలు మాట్లాడుకుంది. 'మనవూరి రామాయణం' సినిమా విడుదలైంది. దీనిపై కొందరు నాకు సలహా ఇచ్చారు. ఇంత మంచి సినిమా తీస్తే జనాలు చూడరు. కొంచెం మ్యాటర్‌, ఐటమ్‌లు ఉంటే చూస్తారని అన్నారు. లేదు చూస్తారని నేను నమ్మాను. కానీ ఈ రెండు రోజుల కలెక్షన్స్‌ చూస్తే వాళ్లే గెలిచేటట్లు ఉన్నారు. మీ ఇష్టం ఎలాంటి సినిమా చూడాలనేది.


  కానీ 'మన వూరి రామాయణం'లాంటి సినిమా చూస్తే నేనే కాదు, ఇలాంటి మంచి సినిమాలు తీసేవాళ్లు నమ్మకంతో ఉంటారు. నేనైతే ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటాను. పండగవేళ మీ కుటుంబ సభ్యులతో 'మనవూరి రామాయణం' చూస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు. మరి సినిమాకు మీరు వెళ్తున్నారా..బయిలు దేరారా..


  English summary
  Prakash Raj Requesting Telugu Audience To Watch Mana Voori Ramayanam Movie because of no collections to mana voori ramayanm movie. He says its comedy thriller Mana oori ramayanam from Prakash Raj receiving huge applause from critics. But it seems that the tollywood audience not receiving it well. So, Prakashraj made a video request to audience to watch his movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more