»   » డైరక్టర్ గా ప్రకాష్ రాజ్: తెలుగులో కొత్త చిత్రం ప్రకటన, పోస్టర్

డైరక్టర్ గా ప్రకాష్ రాజ్: తెలుగులో కొత్త చిత్రం ప్రకటన, పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గతంలో తెలుగులో ధోణి, ఉలవచారు చిత్రాలు డైరక్ట్ చేసిన ప్రకాష్ రాజ్ మరోసారి మెగాఫోన్ పట్టారు. ఆయన తన కొత్త చిత్రం టైటిల్ ని పోస్టర్ ని ఫేస్ బుక్ సాక్షిగా ప్రకటించారు. తెలుగు,కన్నడ భాషల్లో ఆ చిత్రం రూపొందనుందని తెలియచేసారు. ఆ పోస్టర్ ఇక్కడ చూసి మీ అభిప్రాయాలు క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

My next #directorial film ..#Kannada/Telugu bilingual..Yet another journey of reinventing self....on sets this winter

Posted by Prakash Raj on 21 November 2015

మన ఊరి రామాయణం అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం ఓ గ్రామంలో జరిగే కథ అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న గ్రామాల పరిస్ధితులు, అక్కడ సమస్యలను వినోదాత్మకంగా చర్చించటానికే ఈ చిత్రం కథాంశం ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సినిమాలో ప్రధాన పాత్రలందరూ కొత్త వాళ్లే అని తెలుస్తోంది.

Prakash Raj’s new film as director announced

ఓ ప్రక్కన నటుడుగా ఆయన బిజీగా ఉంటూనే ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. రీసెంట్ గా ఆయన కమల్ తో చేసిన చీకటి రాజ్యం చిత్రంలో ఆయన నటనకు గానూ మంచి ప్రసంశలు వస్తున్నాయి. కమల్ సైతం ఆయన్ని అభినందిస్తూ పార్టీ ఇచ్చారు.

#thoongaavanam ..Thank you for the brilliant response..Happy for the team..truly deserved..Cheers to #cheekatirajyam

Posted by Prakash Raj on 12 November 2015

ఇక తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ దత్తత గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి స్ఫూర్తితో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ప్రకాష్ రాజ్ ఈ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

ఎప్పటికప్పుడు ప్రకాష్ రాజ్ కొండారెడ్డిపల్లిని సందర్శించి అక్కడి ప్రధాన సమస్యలు ఏమిటి? ఏం చేస్తే బావుంటుంది అనే అంశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రణాళిక బద్దంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Actor Prakash Raj new film is titled Mana Oori Ramayanam will be made in Telugu and Kannada languages.
Please Wait while comments are loading...