»   » ప్రకాష్ రాజ్...అల్జీమర్స్... అరవై ఏళ్లు చామన ఛాయ

ప్రకాష్ రాజ్...అల్జీమర్స్... అరవై ఏళ్లు చామన ఛాయ

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: కంగారుపడకండి ప్రకాష్ రాజ్ కు అరవై ఏళ్లు రాలేదు. అలాగే ఆయనకేమీ అల్జీమర్స్ కంప్లైట్ కూడా రాలేదు. నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకుని ఓ టైమ్ లో హీరోగా సైతం తనతో సినిమాలు చేసే స్దాయికి ఎదిగిన ప్రకాష్ రాజ్ ఈ మద్యకాలంలో కాస్త ఖాళీ పడ్డారనే చెప్పాలి. దాంతో వెంటనే ఆయన తన దృష్టిని మొత్తం సినిమా డైరక్షన్ వైపు పెట్టారు.

  అయితే ఆయన అన్నీ రీమేక్ లే చేస్తున్నారు. కన్నడ, మళయాళ భాషల్లోని హిట్ చిత్రాల రైట్స్ తీసుకుని రీమేక్ లు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి దర్శకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు తీశాడు ప్రకాష్ రాజ్. కానీ సరైన హిట్ పడలేదు. నాలుగో సినిమా 'మన ఊరి రామాయణం' ఇంకొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. అదీ మళయాళంలో వచ్చి హిట్టైన షట్టర్ అనే చిత్రం రీమేక్.

  Prakash Raj's next: 60 Yellu Chamana Chaya

  అది రిజల్ట్ దాకా ఆగకుండా .. ఈ లోపే దర్శకుడిగా తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు ప్రకాష్. ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్ ఖాయం చేశాడు ప్రకాష్ రాజ్. 'అరవై ఏళ్లు.. చామన చాయ'.. ఇదీ ప్రకాష్ రాజ్ కొత్త సినిమా పేరు. ఈ సినిమాలో ఆయనే లీడ్ రోల్ చేస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుంది. అలాగే ఎప్పటిలాగే ఇది డైరెక్ట్ మూవీ కాదు.. రీమేక్.

  కన్నడంలో ఈ మధ్యే విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'గోధి బన్న సాధారణ మైకట్టు'. ఈ సూపర్ హిట్ చిత్రాన్నే రీమేక్ చెయ్యనున్నాడు ప్రకాష్ రాజ్. కొత్త దర్శకుడు హేమంత్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కనిపించకుండా పోయిన తండ్రిని వెతుక్కునే కొడుకు కథగా కన్నడ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ తన ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ తరపున తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్ననట్లు తెలుస్తోంది.

  అప్పటిదాకా తండ్రి అంటే చిరాకు పడే కొడుకు.. తండ్రిని వెతికే క్రమంలో ఆయన గొప్పదనం తెలుసుకుంటాడు. చాలా హృద్యంగా సాగే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా చూడగానే ముగ్ధుడైపోయిన ప్రకాష్ రాజ్.. దానిపై ప్రశంసల జల్లు కురిపించి రైట్స్ తీసేసుకున్నారు. మాతృకలో అనంత్ నాగ్ పోషించిన పాత్రనే ప్రకాష్ రాజ్ చేయనున్నారు. మరి ఆయన కొడుగ్గా నటించేదెవరో త్వరలో తెలియనుంది.

  English summary
  ‘Godhi Banna Sadharana Mykattu’ movie mainly consists of mystery as well as thriller backdrops. Already multi-talented actor Prakash Raj bought remake rights of this Kannada movie ‘Godhi Banna Sadharana Mykattu’."Yes, I am planning to launch this shortly. And the title is 60 Yellu Chamana Chaya," says Prakash Raj. As the title suggests, Prakash Raj will be playing the role of 60-year-old guy who is afflicted with early stages of Alzheimer's disease.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more