Just In
- 10 min ago
స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
- 16 min ago
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
- 32 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 1 hr ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
Don't Miss!
- News
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు... తేల్చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్...
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'షమితాబ్' పై ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్
హైదరాబాద్: అమితాబ్, ధనుష్ కలయికలో 'షమితాబ్' మొదలైనప్పటి నుంచి ఆ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల క్రితం ట్రైలర్ విడుదలయ్యాక అది మరింత పెరిగింది. ఎన్నో అంచనాలతో ఈ శుక్రవారం విడుదలైంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో ధనుష్, అమితాబ్ పోటా పోటీగ నటించారు. ముఖ్యంగా ధనుష్ నటనకు బాలీవుడ్ సలామ్ చేసింది. అయితే సినిమాకు ఉన్న యాంటి క్లైమాక్స్ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో మరో ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని చూసి కామెంట్ చేయటం జరిగింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ... "షమితాబ్ . వర్కవుట్ కానీ ఓ బ్రిలియెంట్ ఐడియా..అయితే అలాగని ఈ టీమ్ ఫ్యాషన్ ని, స్పిరిట్ ని, కమిటిమెంట్ ని తీసి పారేయలేం... ఇలాంటి ఎటెమ్ట్ చేసినందుకు టీమ్ కు హాట్సాఫ్... లవ్ యు ఆల్...రెస్పెక్ట్ " అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాని అమితాబ్ బచ్చన్ కోసం, ధనుష్, అక్షర, పి సి శ్రీరామ్, ఇళయరాజా కోసం ఓ సారి చూడవచ్చు అని చెప్పారు. ఇక ఇప్పటికి మొదటి రోజులు ఎనిమిధి కోట్లు మాత్రమే వసూలు చేసింది. టోటల్ రన్ ...50 కోట్లు లోపే ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.

ఇక 'షమితాబ్' చిత్రంలో ఉన్న విశేషాలేంటో చూద్దాం.
* 'చీనీకమ్', 'పా' లాంటి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్.బాల్కి దర్శకత్వంలో అమితాబ్ నటించిన మూడో చిత్రం షమితాబ్.
* షమితాబ్ టైటిల్ వెనుక ఆసక్తికరమైన విషయం ఒకటుంది. మొదట ఈ చిత్రాన్ని అమితాబ్, షారుఖ్‌తో రూపొందించాలనుకున్నారట. అందుకే ఇద్దరి పేర్లు కలిసేలా షమితాబ్ అని పెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల షారుఖ్ స్థానంలో ధనుష్ వచ్చారు. ధనుష్ పేరులో కూడా 'ష్' అక్షరం ఉండటంతో అదే పేరు కొనసాగించారు.
* ఇందులో అమితాబ్, ధనుష్‌ల పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. స్టార్ హీరో కావాలని కలలు కనే మూగ, చెవిటి జూనియర్ ఆర్టిస్ట్‌గా ధనుష్ నటిస్తున్నారు. ధనుష్ పాత్రకు అమితాబ్ గొంతు అరువివ్వడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
* ఈ సినిమాలో మాసిన గెడ్డంతో మురికి సూట్ వేసుకొని అమితాబ్ విచిత్రమైన గెటప్‌లో కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులు అమితాబ్ అదే అవతారంలో ఉన్నారు.
* అమితాబ్ ఈ చిత్రం కోసం 'పిడ్లీ సీ బాతే' అంటూ సాగే ఓ పాట కూడా పాడారు. టాయిలెట్‌లో కూర్చొని అమితాబ్ ఆ పాట పాడటం ట్రైలర్‌లో చూసి ప్రేక్షకులు థ్రిల్‌కు గురయ్యారు.
* కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయమవుతోంది. అంతేకాదండోయ్.. ఈ సినిమాలో ఓ పాట కోసం తనే కొరియోగ్రఫీ కూడా చేసుకొంది.
* మేస్ట్రో ఇళయరాజాకు ఇది 999వ సినిమా. ఇందులో 'స్టీరియో ఫోనిక్ సొనాటా' అంటూ సాగే గీతాన్ని గతంలో తాను రజనీకాంత్ చిత్రానికి స్వరపరచిన ఓ సూపర్ హిట్ పాట ఆధారంగా రూపొందించారు ఇళయరాజా. ఈ పాటను ఇప్పుడు శృతిహాసన్ పాడటం విశేషం.
* 'షమితాబ్' చిత్ర కథ అందులో నటించే వారినే కాదు పరిశ్రమ ప్రముఖులనూ ఆకట్టుకుంది. అందుకే అమితాబ్, ధనుష్, బాల్కిలతో పాటు అభిషేక్ బచ్చన్, సునిల్ లుల్లా, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ఆర్‌కే దమని, సునిల్ మన్‌చందా.. ఇలా ఎనిమిది మంది ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
* అమితాబ్, ధనుష్‌ల జోడీతో పాటు 10 మంది ప్రముఖ దర్శక నిర్మాతలు ఇందులో అతిథి పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నారు. రోహిత్‌శెట్టి, కరణ్ జోహార్, మహేష్‌భట్, అనురాగ్ బసు, రాకేష్ ఓంప్రకాష్‌మెహ్రా, రాజ్‌కుమార్ హిరాణీ, జావేద్ అఖ్తర్, బోనీ కపూర్, ఏక్తాకపూర్, గౌరీ షిండే ఈ చిత్రంలో తళుక్కున మెరిసారు.