»   » ప్రకాష్ రాజ్ ఫీలయినా...మంచి నిర్ణయమే

ప్రకాష్ రాజ్ ఫీలయినా...మంచి నిర్ణయమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరసగా రీమేక్ లు చేస్తూ ప్లాఫులు కొని తెచ్చుకుంటున్న ప్రకాష్ రాజ్ దర్శకుడుగా మంచి మార్కులు వేయించుకోలేకపోతున్నారు. సినిమా బాగుందంటున్నా కలెక్షన్స్ కనపడటం లేదు. అడపా,దడపా కలెక్షన్స్ ఫరవాలేదనిపించినా ఆ క్రెడిట్ ఒరిజనల్ సినిమాకే వెళ్లిపోతోంది. దాంతో ఆయన స్నేహితులు, సన్నిహితులు ఆయన్ని ఈ విషయంలో మందలించారట. మంచి టాలెంట్ పెట్టుకుని ఒరిజనల్ కథతో రావచ్చు కదా అన్నారుట. ముఖ్యంగా ఆయన స్నేహితుడు బి సురేష ఈ విషయంలో ప్రకాష్ రాజ్ తో గట్టిగా వాదించాడట. ఉలవచారు బిర్యాని ప్రయోగం వికటంచటం ఉదాహరణగా చూపెట్టారటు. దాంతో ప్రకాష్ రాజ్ కాస్త ఫీలయినా, తన తదుపరి చిత్రం తన స్వంత ఆలోచనతోనే చేస్తానని మాట ఇచ్చారట. అంటే త్వరలో ప్రకాష్ రాజ్ తనదైన ఆలోచనలతో తీసే చిత్రం చూడబోతున్నామన్నమాట. మంచి నిర్ణయమే మరి.

రీసెంట్ గా పెద్ద వివాదం జరిగి 'ఆగడు' నుంచి ప్రకాష్ రాజ్ బయిటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బయిటకు వచ్చిన ప్లేస్ లోకి సూనూసూద్ ని తీసుకుని షూట్ చేస్తున్నారు శ్రీను వైట్ల. ఇప్పుడు దాన్ని కాంపన్ సేట్ చేయటానికా అన్నట్లు 'గోవిందుడు అందరి వాడేలే' లో రాజ్ కిరణ్ ని తొలిగించి... ప్రకాష్ రాజ్ కు పాత్ర ఇచ్చారు. దాంతో ఈ విషయం మీడియా సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. గతంలోనూ తనను తీసేసి వేరే వారిని పెట్టుకుని షూట్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

 Prakash Raj says no to remakes

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... నా పాత్రను ఇంకొకరు చేయడం, వేరేవాళ్లు చేస్తున్న పాత్రని నేను చేయడం.. అనేవి సినిమా రంగంలో సహజమే. అడిగారు. కథ చెప్పారు. పాత్ర చెప్పారు. నచ్చింది. చేస్తున్నా. సినిమాలో ఒకర్ని తీసే హక్కు, ఒకర్ని పెట్టుకునే హక్కు దర్శకులకి ఉంటుంది. దాన్ని మనమేం చేయలేం. అవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. 'నిజం'లో మొదట మురళీమోహన్ చేసిన కేరక్టర్‌ను నేను చేశాను. దర్శకునికి ఒకరు నచ్చకపోతే ఇంకొకర్ని పెట్టుకుంటాడు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మన అవసరాల్ని బట్టే సినిమాలుంటాయి. ఒకరికి నేను కావాలని ఉండదు. ఒకరికి నేను కావాలని ఉంటుంది. ప్రస్తుతం కృష్ణవంశీ సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' చేస్తున్నా అన్నారు.

ఉలవచారు బిర్యాని విషయానికి వస్తే... రొమాంటిక్ కామెడీ గా రూపొందిన ఈ చిత్రం కథలో ని ప్రధానమైన మలుపు లవ్ ట్రాక్ గతంలో మనం ఆది చిత్రం లవ్ లీ చిత్రంలో చూసిందే కావటంతో ప్రెష్ గా అనిపించదు. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ తన నటనతో ఆ సినిమా గుర్తుకు రాకుండా చేయగలిగారు కానీ...అంతకుమించి ఏమీ చేయలేకపోయారు. నేటివిటీ కోసం ఒరిజనల్ లో చేసిన మార్పులు స్క్రీన్ ప్లే లో ఇమడక దెబ్బ తీసాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు, అందులో ఎలిమెంట్స్ కు అలవాటు పడిన వారికి అసలే ఈ సినిమా కష్టమనిపిస్తుంటే,అంతే కాకుండా బాగా స్లో నేరేషన్ లో కథ చెప్పటం ద్వారా దర్శకుడు ఫీల్ తీసుకు వద్దామనుకున్నారు. కానీ... మరీ అంత స్లోగా చిత్రంచూస్తున్నవారికి భారంగా మారి ఓ పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ తీసుకు వచ్చింది. అయితే ప్రకాష్ రాజ్, స్నేహ తమ నటనతో సినిమాకు ప్రత్యేకంగా నిలచారని చెప్పటంలో సందేహం లేదు. ఇళయరాజా సంగీతం ఉన్నంతలో సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సైతం డీసెంట్ గా ఉన్నాయి.

English summary

 Actor-director Prakash Raj has decided to direct an original script soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu