For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగు ప్లాప్ రీమేక్ లో నానా పటేకర్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఆ మధ్యన ప్రకాష్ రాజ్, స్నేహ కాంబినేషన్ లో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో అది డిజాస్టర్ అయ్యింది. కాని ఇప్పుడది హిందీలో రీమేక్ అవుతోంది. నానా పటేకర్ ఈ రీమేక్ లో చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ డైరక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కి డైరక్టర్ గా ఇది తొలి హిందీ చిత్రం. ఈ చిత్రం ఖచ్చితంగా అక్కడ ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు... దక్షిణాదిలో దర్శకుడిగానూ పలు చిత్రాలు రూపొందించారు ప్రకాష్‌రాజ్‌. ఇప్పుడు ఆయన బాలీవుడ్‌లోనూ మెగాఫోన్‌ పట్టడానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహిస్తూ నటించిన 'ఉలవచారు బిర్యానీ' చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రను హిందీ నటుడు నానా పటేకర్‌ పోషిస్తున్నారు.

  ఈ కథ నానా పటేకర్‌కు బాగా నచ్చిందట. ''ప్రకాష్‌రాజ్‌ మంచి నటుడే కాదు దర్శకుడు కూడా. ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉందని'' చెప్పారు పటేకర్‌. తెలుగులో స్నేహ పోషించిన పాత్రను అక్కడ ఎవరు పోషిస్తారో చూడాలి. ఈ మేరకు హిందీ కోసం స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

  Prakash Raj signs Nana Patekar for his directorial debut in Bollywood

  ‘ఉలవచారు బిర్యాని' చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్' కు రిమేక్. ఈ సినిమాలో స్నేహ మరియు ఊర్వశినటించారు . ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మించారు. ఇళయరాజా సంగీత దర్శకుడు. కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది.

  మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. మళయాళంలో వచ్చిన ‘సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించిన ఈ "ఉలవచారు బిర్యానీ" కి ‘ లవ్ ఈజ్ కుకింగ్ ‘ అన్న ట్యాగ్ లైన్ తగిలించారు.

  చిత్రం కథేమిటంటే...

  పురావస్తు శాఖలో పనిచేసే కాళిదాసు(ప్రకాష్ రాజ్) భోజన ప్రియుడు...క్రానిక్ బ్యాచులర్. మరో ప్రక్క గౌరీ(స్నేహ) ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. జాతకంలో ఉన్న దోషంతో పెళ్లి కాక మిగిలిపోతుంది. వీళ్లిద్దరూ అనుకోనివిధంగా..విధి వశాత్తు ఫోన్ లో గొడవ పడతారు. అయితే తర్వాత తాము పొరపాటు పడ్డామని,రాంగ్ నెంబర్ అని తెలుసుకుని సారీ చెప్పుకుంటారు.

  అలా మొదలైన వీరి ఫోన్ స్నేహం... పెరిగి ఓ ఫైన్ డే కలవాలనే నిర్ణయానికి వస్తారు. అయితే తమ వయస్సులు గురించి ఆలోచించిన కాళిదాసు,గౌరీ ఒకరినొకరు కలవటానికి సంశయిస్తారు. ఆ సంసయంలో తమ అసలు ఐడెంటిటీ బయిటపెట్టకుండా... కాళి దాసు తన మేనల్లుడు నవీన్ (తేజస్)ని, గౌరీ తన సోదరి(సంయుక్త)ని పంపుతారు . అప్పుడేం జరిగింది. వీరిద్దరూ ఎలా కలిసి,ఒకటయ్యారు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో ఈ యువ జంట పాత్రేమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  English summary
  Prakash Raj, hindi directorial debut will be a remake of his Telugu film Ulava Charu Biryani. For this, he has already signed Nana Patekar as the hero of the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X