»   » ‘డిక్టేటర్’: బాలయ్య సరసన పవన్ హీరోయిన్

‘డిక్టేటర్’: బాలయ్య సరసన పవన్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ...అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రణీత ఇప్పుడు బాలకృష్ణ సరసన చేయటానికి కమిటైంది. పవన్ సరసన ‘అత్తారింటికి దారేది' చిత్రంతో ఒక వెలుగు వెలిగి ఇటు తెలుగు నాట...అలాగే అటు తమిళ నాట వరుస అవకాశాలను అందిబుచ్చుకున్న ఆమెకు తాజాగా టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణతో నటించే అవకాశం రావటంతో ఆనందంలో మునిగి తేలుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం వివరాల్లోకి వెలితే...

నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం ‘డిక్టేటర్' లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 20నుంచి సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య సరసన ఇప్పటికే ఓ హీరోయిన్ అంజలి ఖరారైంది. మరో హీరోయిన్‌గా ప్రణీతను ఎంపిక చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను తెరకెక్కించనుంది.

Praneetha is Balayya’s leading lady?

దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంకోసం టాలీవుడ్ ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు రచయితలుగా పనిచేస్తున్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ....కుటుంబ బంధాలు, యాక్షన్, వినోదం అన్ని సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. కోన వెంకట్, గోపీమోహన్ చక్కటి కథను అందించారు. కొత్త టీమ్‌తో పనిచేయటం ఆనందంగా ఉంది .దర్శకుడు శ్రీవాస్ చెప్పిన కథలో కొత్తదనం ఉండడంతో చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని, కోన వెంకట్, గోపీ మోహన్, రత్నం, శ్రీధర్ సీపానలు ఈ చిత్రంకోసం పనిచేస్తున్నారని, యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతుందని తెలిపారు.

ప్రేక్షకులు, అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటారో అలా ఈ చిత్రం రూపొందనుందని ఈరోస్ సునీల్‌లుల్లా తెలిపారు. ఈనెల 29న ప్రారంభంకానున్న యాక్షన్ ఎమోషనల్ డ్రామా అంశాలతో రూపొందే డిక్టేటర్ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని, ఇప్పటివరకు బాలయ్యను చూడని విధంగా వైవిధ్యంగా ఈ చిత్రంలో చూపనున్నామని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.

అలాగే...శ్రీవాస్ మాట్లాడుతూ బాలకృష్ణను సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. కథ, కథనాలు నవ్యరీతిలో సాగుతాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సహనిర్మాతగా కొనసాగనుండటం సంతోషంగా ఉంది. మరో కథానాయికను త్వరలో ఎంపికచేస్తాం అని తెలిపారు.

అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Praneetha is roped in as a leading lady for Balayya’s 99th film. Whether she is taking up second heroine role or a leading lady role is not yet known but Anjali is also another main heroine in the movie.
Please Wait while comments are loading...