»   » ‘అత్తారింటికి దారేది’లో పాత్ర గురించి ప్రణీత

‘అత్తారింటికి దారేది’లో పాత్ర గురించి ప్రణీత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :''ఈ సినిమాతో నా ఎదురు చూపులు ఫలించనున్నాయి. నాకో బిగ్ హిట్ రాబోతోంది. నేను నమ్మకంగా చెబుతున్న మాట ఇది. పవర్‌స్టార్ సినిమా అంటే నే మినిమమ్ గ్యారెంటీ. విడుదలైన వారానికే ఆయన సినిమాలు సక్సెస్ బార్డర్‌ని దాటేస్తుంటాయి. ఇక 'అత్తారింటికి దారేది' విషయానికొస్తే.. బ్లాక్‌బస్టర్ చిత్రానికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్న సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చింది'' ప్రణీత.

చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... ఇందులో బాపు బొమ్మలాంటి అందమైన పాత్ర చేశాను. కచ్చితంగా నాకు మంచి పేరు తెచ్చే పాత్ర ఇది. ఈ సినిమా విషయంలో నాకు ప్రమోషన్ లేకపోయినా ఫర్లేదు. హిట్ కొడితే చాలు. 'అత్తారింటికి దారేది' తర్వాత టాలీవుడ్ దర్శక, నిర్మాతలందరూ నా వెంటపడతారు అని ధీమా వ్యక్తం చేశారు ప్రణీత.

వరస ఫ్లాపుల్లో ఉన్న ప్రణిత ఆశలన్నీ 'అత్తారింటికి దారేది'చిత్రంపైనే ఉన్నాయి. ఊహించనివిధంగా ఈ చిత్రంలోకి వచ్చిపడింది ప్రణీత. చాలా మందిని అనుకున్న తర్వాత ప్రణీతను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో చేయటంతో ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి దృష్టీ ప్రణీత పైన ఉంది.

ప్రణీత మిగతా విశేషాలు స్లైడ్ షోలో....

ప్లాపు లు వచ్చినా...

ప్లాపు లు వచ్చినా...

ప్రణీతకు ప్రారంభం నుంచి ఫ్లాపులతోనే కాపురం చేస్తున్నా.. అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మను వదలడం లేదు. ‘ఒకదాన్ని మించింది ఒకటి' అన్నట్లు... పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రణీతను వరిస్తున్నాయి. దానికి ఆమె పెద్ద కళ్లు కారణం ఒకటైతే,నటన కూడా ప్లస్ అవుతోంది.

సిద్దార్ధ ప్రక్కన చేసినా...

సిద్దార్ధ ప్రక్కన చేసినా...

‘ఏం పిల్లో ఏం పిల్లడో' ఫ్లాప్ అవ్వగానే... సిద్దార్ద సరసన ‘బావ' చిత్రంతో జోడీ కట్టే ఛాన్స్ తగిలింది. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాపు అవగానే.... ‘ప్రణీత ఇక ఇంటికే' అనుకున్నారంతా. కానీ వెంటనే కోలీవుడ్‌లో అడుగుపెట్టి... ‘శకుని'తో కార్తీతో జత కట్టి మళ్లీ అందరినీ నివ్వెరపరిచారు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్నయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా... పవర్‌స్టార్‌తోనే ‘సై' అనేశారు ప్రణీత.

పవన్ పైనే ఆశలన్నీ...

పవన్ పైనే ఆశలన్నీ...

‘అత్తారింటికి దారేది' చిత్రంలోని తన పాత్ర గురించిప్రణీత చాలా ఎక్సైట్ మెంట్ తో మీడియాతో చెప్తోంది. ‘అత్తారింటికి దారేది' తర్వాత టాలీవుడ్ దర్శక, నిర్మాతలందరూ నా వెంటపడతారు అని ధీమా వ్యక్తం చేస్తోంది ప్రణీత. ఈ సినిమాతో ఆమె గ్రాఫ్ మారుతుందని చెప్తోంది.

‘అత్తారింటికి దారేది' రిలీజ్ తర్వాతే...

‘అత్తారింటికి దారేది' రిలీజ్ తర్వాతే...

ప్రస్తుతం ‘పిజ్జా' కన్నడ రీమేక్ ‘విజిల్' చిత్రానికీ, మరో కన్నడ చిత్రం ‘అంగారక'కు సైన్ చేశారు ప్రణీత. తెలుగులో ఆఫర్స్ వస్తున్నా...‘అత్తారింటికి దారేది' విడుదల అయ్యాకే మిగతావి కమిట్ కావాలని భావిస్తోంది. ఈ సినిమా తర్వాత పెద్ద హీరోలు సరసన తెలుగులో బుక్కు అవుతానంటోంది.

చెల్లెలు పాత్ర??

చెల్లెలు పాత్ర??

‘అత్తారింటికి దారేది'లో ప్రణీత పాత్ర సమంతకు చెల్లెలు అని వినపడుతోంది. అయితే అది నిజమో కాదో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా ఆగాలి. కానీ గ్లామర్ గా ఆమె పాత్ర తీర్చి దిద్దపడిందని, పవన్ తో ఆమె కాంబినేషన్ లో వచ్చే సీన్స్ విజిల్స్ వేయిస్తాయని చెప్తున్నారు.

ఆగస్టు 7నే తీర్పు...

ఆగస్టు 7నే తీర్పు...

'అత్తారింటికి దారేది' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం ఆగస్టు 2 న సెన్సార్ జరగనుంది. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. ఈచిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయడంతో ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని పూర్తిగా అయిపోయింది.

ఎక్కువ మందికి తెలుస్తుంది

ఎక్కువ మందికి తెలుస్తుంది

‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నైజాంలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 320కి పైగా థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. పవర్ స్టార్ సినిమా కాబట్టి థియేటర్లు ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని, కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తే ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు. దాంతో ప్రణీత కూడా...తాను ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుతుందని అంటోంది.

‘అత్తారింటికి దారేది' లో పంచ్ లు...

‘అత్తారింటికి దారేది' లో పంచ్ లు...

ప్రణీత ఈ సినిమాలో పంచ్ లు విసిరి నవ్వించబోతోంది. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు. ఈ సన్నివేశం థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుందని యూనిట్ సభ్యలు అంటున్నారు. స్వతహాగా రచయిత అయిన త్రివిక్రమ్ ఈ చిత్ర స్క్రిప్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ సీన్లతో పాటు, పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి.

English summary
Pranitha has been play one of the female leads in Pawan Kalyan's film. She has been roped in by Trivikram Srinivas for his latest film starring Kalyan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu