»   » ద్రోహి అంటూ పవన్ హీరోయిన్‌ మీద విమర్శల దాడి!

ద్రోహి అంటూ పవన్ హీరోయిన్‌ మీద విమర్శల దాడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం తీవ్ర అవమాన కరపరిస్థితులు ఎదుర్కొంటోంది. అందుకు కారణం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆమె తెలుగు టీంకు సపోర్టు చేయడమే. కన్నడ భామ అయిన ప్రణీత.... తెలుగు టీంకు సపోర్టు చేయడాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేక పోతున్నారు.

గతేడాది కన్నడ పరిశ్రమను సపోర్ట్ చేసిన ప్రణీత ఈసారి పార్టీ మార్చందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై తీవ్రమైన కామెంట్లు.... వస్తుండటం, అందులో కొన్ని వల్గర్ గా ఉండటంతో అమ్ముడు తీవ్రంగా కుమిలిపోతోంది. కొందరు తనను ద్రోహి అటుండటంతో తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది.

Pranitha abused by Kannada fans

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిపై ప్రణీత స్పందిస్తూ...ఏ టీమ్‌ని సపోర్ట్ చేయాలనేది నా చేతిలో ఉండదు. అలాంటి అవకాశం గనక ఉంటే నేను అందరినీ సపోర్ట్ చేస్తా అని తెలిపింది. ఇలాంటి పరిస్థితి పగ హీరోయిన్ కూడా రాకూడదని మదన పడుతోంది ఈ బాపుబొమ్మ.

ప్రస్తుతం ప్రణీత రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ఆది హీరోగా తెరకెక్కుతున్న ‘చుట్టాలబ్బాయ్'. మరొకటి మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం'.

English summary
Now, Pranitha's support to the Telugu Warriors team in the recently launched Celebrity Cricket League (CCL) has hurt her Kannada fans who started abusing her and even called her a traitor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu