»   » గోపిచంద్ తో సరసలాడుతున్న ఆ కొత్త భామ ఎవరు..!?

గోపిచంద్ తో సరసలాడుతున్న ఆ కొత్త భామ ఎవరు..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్నటి వరకూ హీరో గోపిచంద్ తో ప్రేమాయణం నడిపిన అనుష్క అతనికి హ్యాండ్ ఇచ్చి భూమిక భర్త భరత్ ఠాగూర్ తమ్ముడిని పెళ్ళడనుందన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే గోలీమార్ తర్వాత గోపిచంద్ నటించిన సినిమా ఏది రాలేదు. ఇప్పుడు తాజాగా గోపిచంద్ తో 'శౌర్యం" సినిమా తీసిన భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో రైటర్ బి.వి.ఎస్. రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్న ఒక చిత్రం రాబోతుంది.

మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో 'ఏం పిల్లో ఏం పిల్లడో" సినిమాతో హీరోయిన్ గా పరిచయమై తన లేలేత అందాలను ప్రదర్శించిన ప్రణీత ఎంపికైంది. ఆల్రెడీ సిద్దార్థ సరసన 'బావ" చిత్రంలో మరదలిగా ప్రణీత నటిస్తోంది. ఇప్పుడు తాజాగా గోపిచంద్ తో జత కట్టి సరసమాడనుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. మరి వీరి జోడి గోపిచంద్..అనుష్క అంత హిట్ అవుతుందో తేదో చూద్దాం..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu