»   » దెబ్బలు తగిలాయ్‌...రక్తం వచ్చింది: ప్రణీత

దెబ్బలు తగిలాయ్‌...రక్తం వచ్చింది: ప్రణీత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బైక్‌ పైనుంచి కిందకు జంప్‌ చేసే సన్నివేశంలో నిజంగానే పడిపోయా. మోకాళ్లకు దెబ్బలు కూడా తగిలాయి. సెట్లోనే ఒకటికి పదిసార్లు రిహార్సల్స్‌ చేసేదాన్ని. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దెబ్బలు తగిలేవి. ఓసారి గోరు పూర్తిగా విరిగిపోయి రక్తం వచ్చింది. ఓ సన్నివేశంలో బల్ల కింద నుంచి పది అడుగుల మేర జారే సన్నివేశం ఉంది. దాని కోసం ఎన్ని టేకులు తీసుకొన్నానో లేక్కేలేదు. చిన్న చిన్న దెబ్బలు తగిలినా నేనైతే వ్యక్తిగతంగా షూటింగ్‌ని బాగా ఆస్వాదించా'' అంటోంది ప్రణీత

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలే పోషించా. 'డైనమైట్‌' కోసం తొలిసారి యాక్షన్‌ దృశ్యాల్లో నటించాల్సివచ్చింది. యాక్షన్‌ అంటే ఫైట్లు కాదు. ఛేజింగుల్లో పాల్గొన్నా. ఒక భవనం మీద నుంచి మరో భవనంలోకి రోప్‌ సహాయంతో జంప్‌ చేశా. ఇవన్నీ నాకు పూర్తిగా కొత్త. విజయన్‌ మాస్టర్‌ ఈ సన్నివేశాల్ని వివరిస్తుంటే భయమేసింది. 'ఏంటి మాస్టర్‌... ఇలాంటివి నేను చేయగలనా?' అని అడిగాను. కానీ ఆయన నాలో ధైర్యం నూరిపోశారు'' అంటూ చెప్పుకొచ్చారు ప్రణీత.


Pranitha 's Actions in 'Dynamite' will Stun Audiences

దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న 'డైనమైట్‌' చిత్రం ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌. సినిమా నిండా ఫైటింగులూ, ఛేజింగులే. అందుకే యాక్షన్‌ ఎపిసోడ్స్‌పై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు విష్ణు. కేవలం ఫైట్స్‌ కోసం 47 రోజులు కేటాయించారంటే ఈ సినిమాలో యాక్షన్‌కి ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది.


కొన్ని పోరాట దృశ్యాల్లో విష్ణుతో పాటు హీరోయినా్ ప్రణీత పాలుపంచుకొంది. విజయన్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ పోరాట దృశ్యాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని మంచు విష్ణు చెబుతున్నారు. వచ్చే నెల 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Stunt director Vijayan has been impressed by praneetha's daredevil action scenes in "Dynamite". They will leave the audiences spellbound, the stunt master said.
Please Wait while comments are loading...