»   » 'బ్రహ్మోత్సవం' తోనే కాదు... వీటి వల్ల కూడా పీవిపి 100 కోట్లు పోగొట్టుకుంది...(లిస్ట్)

'బ్రహ్మోత్సవం' తోనే కాదు... వీటి వల్ల కూడా పీవిపి 100 కోట్లు పోగొట్టుకుంది...(లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు వాడైన ప్రసాద్ వి పొట్లూరి యూరఫ్ లో రకరకాల వ్యాపారాలు చేసి బాగా సంపాదించడం, ఆ డబ్బుతో ఇండియా వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం తెలిసిందే. 2011లో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ఆయన గడిచిన ఐదేళ్లలో పలు భారీ బడ్జెట్ సినిమాలు తీసారు.

అయితే సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత పివిపి నష్టాలే తప్ప లాభాలు చూడలేదని తెలుస్తోంది. 2011లో తమిళంలో రాజా పట్టై సినిమా ద్వారా పివిపి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇటీవల విడుదలై 'బ్రహ్మోత్సవం'తో కలిసి ఇప్పటి వరకు డజను సినిమాలను పివిపి నిర్మించారు. ఇందులో రెండు మూడు మినహా దాదాపు అన్ని సినిమాలు నష్టాలే మిగిల్చాయని అంటున్నారు.

పివిపి సంస్థకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమా అనుష్క-ఆర్య కాంబినేషన్లో వచ్చిన 'వర్ణ' చిత్రం. ఈ సినిమాతో పాటు సైజ్ జీరో సినిమా కూడా ఈ సంస్థకు ఎక్కువ నష్టాన్నే మిగిల్చింది.

అయితే రవితేజతో పివిపి నిర్మించిన సినిమా మాత్రం యావరేజ్ గ్రాసర్ గా నిలించింది. ఈ సినిమా వల్ల పివిపి సంస్థకు కొంత లాభాలు వచ్చాయి. ఇటీవల పివిపి సంస్థ నిర్మించి ఊపిరి సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ వల్ల బాగా నష్టపోయిందని, దర్శకుడు సినిమా బడ్జెట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి.

పివిపి నిర్మించి సినిమాల్లో కాస్త లాభాలు చూపి సినిమా 'క్షణం'. ఈ సినిమాకు పివిపి సహ నిర్మాతగా ఉన్నారు. ఇప్పటి వరకు పివిపి సంస్థకు వచ్చిన నష్టాలు, కష్టాలు 'బ్రహ్మోత్సవం' సినిమాతో తీరిపోతాయని అంతా భావించారు. అయితే ఈ సినిమా పివిపి మరింత కష్టాల్లోకి నెట్టింది. ఇప్పటి వరకు సినిమా నిర్మాణ రంగంలో పివిపి రూ. 100 కోట్ల వరకు నష్టపోయారని అంటున్నారు.

స్లైడ్ షోలో పివిపికి భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు

వర్ణ

వర్ణ


పివిపికి భాకీ నష్టాలు మిగిల్చిన సినిమాల్లో వర్ణ మొదటి స్థానంలో ఉంటుంది.

సైజ్ జరో

సైజ్ జరో


పివిపికి భారీ నష్టాలు మిగిల్చిన సినిమాల్లో సైజ్ జీరో సినిమా కూడా ఒకటి.

ఊపిరి

ఊపిరి


ఊపిరి సినిమా హిట్ టాక్ వచ్చినా, మంచి వసూళ్లు వచ్చినా...సినిమా బిజినెస్ పూర్తయిన తర్వాత చూస్తే నష్టాలే మిగిలినట్లు తేలిందట. అందుకు కారణం ప్రొడక్షన్ ఖర్చు అధికం కావడమే అని అంటున్నారు.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం


ఇపుడు బ్రహ్మోత్సవం సినిమా కూడా పివిపిని మరింత నష్టాల్లోకి నెట్టింది.

బలుపు

బలుపు


రవితేజతో తీసిని బలుపు సినిమాతో పెద్దగా లాభాలు లేక పోయినా....నష్టాలు లేకుండా బయట పడ్డారు పివిపి.

క్షణం

క్షణం


క్షణం సినిమా ద్వారా కూడా పివిపి లాభాలు వచ్చాయి.

English summary
Entrepreneur-turned-film producer Prasad V Potluri, fondly known as PVP aka PV in film circles, said to have lost a whopping Rs 100 Crore in film production. Made his foray in 2011 with Tamil film Rajapattai (Veedinthe), PVP has seen several setbacks. Anushka and Arya-starrer Varna, Size Zero were two major duds PVP Cinema had produced.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X