Just In
Don't Miss!
- Sports
ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్
- News
Tractor rally: ట్రాక్టర్ల నెంబర్లు రాసుకున్న పోలీసులు, అమ్రేష్ పురి టైపులో ఓం భ్రీమ్ బ్రుష్!
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రకాష్ రాజ్ చేసిది ఆ పాత్ర కాదు.. ప్రశాంత్ నీల్ క్లారిటీ
కేజీయఫ్ చాఫ్టర్ 2 చిత్రీకరణ మొదలైంది. లాక్ డౌన్ తరువాత మొదలుపెట్టిన మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ మూవీగా కేజీయఫ్ రికార్డ్ సృష్టించింది. అయితే సెట్స్‌లో అడుగుపెట్టిన ప్రశాంత్ నీల్.. వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేశారు. అందులో ప్రకాష్ రాజ్ అదిరిపోయే గెటప్‌లో కనిపించాడు. అయితే ఆ లుక్‌ను చూస్తే అందరికీ ఓ పాత్ర గుర్తుకు వచ్చింది.
కేజీయఫ్‌లో హీరో ఎలివేషన్స్‌ను చెప్పే సీనియర్ జర్నలిస్ట్ పాత్రను అనంత్ నాగ్ పోషించాడు. అయితే అనంత్ నాగ్‌ను సినిమా నుంచి తీసేశారని, ఆ పాత్రలో ప్రకాష్ రాజ్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే అనంత్ నాగ్ పాత్ర అంతగా హైలెట్ అయినా ఎందుకు తీసేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు.

ప్రకాష్ రాజ్ పాత్ర గురించి ప్రశాంత్ నీల్ చెబుతూ.. అనంత్ నాగ్ క్యారెక్టర్‌ను రీప్లేస్ చేయడం లేదని, కొత్త పాత్రను సృష్టించానని చెప్పుకొచ్చాడు. ఇది దాదాపు 25 రోజుల షెడ్యూల్ అని, ఫస్ట్ పది రోజుల్లో ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్, నాగభరణం వంటి వారు జాయిన్ అవుతారని తెలిపారు. ప్రస్తుతం ఇది కంఠీవర స్టూడియోలో జరుగుతోందని, ఈ షెడ్యూల్‌లో యష్ జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి పార్ట్ ఎంతగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా రాఖీ భాయ్ పాత్రతో యశ్ పాపులార్టీ దక్కింది.