»   » ఆ సినిమా "బ్యాన్" ప్రసూన్ జోషీ తప్పుకాదు, తీవ్రవాద దోరణిలో..: తుఫాన్ సింగ్ మూవీ వివాదం

ఆ సినిమా "బ్యాన్" ప్రసూన్ జోషీ తప్పుకాదు, తీవ్రవాద దోరణిలో..: తుఫాన్ సింగ్ మూవీ వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

"అబ్‌కీ బార్‌ మోడీ సర్కార్‌, అచ్చేదిన్‌ ఆనేవాలే" నినాద సృష్టికర్త...బీజేపీ ప్రచారాస్త్రాలకు మరింత పదును పెట్టిన కవిగా పేరొందిన ప్రసూన్ జోషి.. పదాల మాయాజాలానికి నరేంద్ర మోడీ ఏనాడో ఫిదా అయ్యారు. దీంతో జోషికి కృతజ్ఞతగా ఈ పదవిని కట్టబెట్టారట.తన విధులను నిర్మాణాత్మకంగా సానుకూలంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని సెన్సార్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రసూన్‌జోషి అన్నారు.

 ప్రసూన్ జోషి

ప్రసూన్ జోషి

వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న మాజీ చైర్మన్ నిహలానీ స్థానంలో జోషీని కేంద్రప్రభుత్వం నియమించింది. మంచి ఉద్దేశంతో విధులను ప్రారంభిస్తున్నానని, సానుకూల మార్పును సాధించేందుకు అనుభవజ్ఞుల సహకారం తీసుకుంటానని ఆయన తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్‌గా నియమితులైన ప్రసూన్ జోషి రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రసిద్ధ సినీ గీతరచయిత.

కాస్త ఊపిరి పీల్చుకున్నారుః

కాస్త ఊపిరి పీల్చుకున్నారుః

ఆయన మూడేళ్ళ పాటు లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వం కొత్త సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. గతం లో ఉన్న పహ్లాజ్ నిహ్లానీ కత్తెర వాడకం చూసి బెంబేలెత్తిన సినీ నిర్మాతలూ, దర్శకులూ జోషీ రాకతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

తూఫాన్ సింగ్

తూఫాన్ సింగ్

ఇక తమ గోడు కొంతైనా తగ్గుతుందని ఆశించారు... అయితే కథ అడ్డం తిరిగిందన్న సంకేతాలు వస్తూండటం గమణార్హం. గతం లో కత్తెర వాడేవాళ్ళు ఇప్పుడీయన ఏకంగా సినిమా మొత్తాన్నీ బ్యాన్ చేసి పారేస్తున్నాడట. ప్రసూన్ నేతృత్వంలోని కమిటీ 'తూఫాన్ సింగ్' అనే పంజాబ్ సినిమా చూసి.. దానిపై నిషేధం విధించినట్లు ఓ నేషనల్ డైలీ కథనం ప్రచురించింది.

తీవ్ర వాద భావజాలం కనిపిస్తుందని

తీవ్ర వాద భావజాలం కనిపిస్తుందని

ప్రసూన్ రివ్యూ చేసిన తొలి సినిమా కూడా అదే అని పేర్కొంది. ఈ చిత్రం ఇండియన్ బ్యూరోక్రసీలో అవినీతి మీద పోరాడే ఓ వ్యక్తి కథతో తెరకెక్కింది. ఐతే ఈ చిత్రంలో హీరోకు తీవ్ర వాద భావజాలం కనిపిస్తుందని.. తీవ్రవాదులు ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేయడాన్ని సమర్థిస్తున్నట్లుగా సినిమా తీశారని.. ఇందులో హింస హద్దులు దాటిపోయిందని.. అందుకే ఈ సినిమాను ప్రసూన్ కమిటీ నిషేధించాల్సి వచ్చిందని.. అంతమాత్రాన ప్రసూన్‌కు, ప్రహ్లాద్‌కు పోలిక పెట్టి ఈయన కూడా ఆ బాపతే అని విమర్శించడం సరికాదని సెన్సార్ బోర్డు వర్గాలు అంటున్నాయి.

రావటమే పేద్ద పంచ్

రావటమే పేద్ద పంచ్

కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్‌గా ప్రహ్లాద్ నిహలానిని తోలగించి ప్రసూన్ జోషిని నియమించినందుకు వారం కిందట దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో సంతోషం వెల్లివిరిసింది. సినిమాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరిస్తూ.. తమ స్వేచ్ఛను ప్రహ్లాద్ హరిస్తున్నాడని.. అలాంటి ఆలోచనలున్న వ్యక్తి సెన్సార్ బోర్డు ఛైర్మన్‌గా ఉండకూడదని కొన్నేళ్లుగా ఫిలిం మేకర్స్ ప్రహ్లాద్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే అదేస్థానం లో వచ్చిన జోషీ రావటం రావటమే పేద్ద పంచ్ ఇచ్చాడు....

English summary
"Toofan Singh is a Punjabi film based on a terrorist. The Pahlaj led CBFC banned the film because according to them the film glorifies terrorism, and that might give a wrong message to today's youth," said Murad while speaking to Indian Express.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu