»   » సారీ.. మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించను.. సంజనతో. లోకేశ్‌పై..

సారీ.. మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించను.. సంజనతో. లోకేశ్‌పై..

Written By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  జీవితంలో మరోసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించనని కన్నడ నటుడు ప్రథమ్ అన్నారు. ఈ సంఘటనకు సంబంధించి నా మిత్రులందరికీ క్షమాపణ చెప్పానని ఆయన మీడియాతో అన్నారు. గతవారం నటుడు, దర్శకుడు, బిగ్ బాస్ కన్నడ కార్యక్రమం విజేత ప్రథమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కన్నడ పరిశ్రమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

  Pratham, Bigg Boss Kannada 4

  ప్రమాదాన్ని గుర్తించి వెంటనే హాస్పిటల్‌కు పంపించడంతో ప్రథమ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో కిమ్స్ హాస్పిటల్ నుంచి విడుదల అయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడాడు.

  సారీ చెప్తున్నాను. మరోసారి చేయను

  సారీ చెప్తున్నాను. మరోసారి చేయను

  ఈ వ్యవహారంలో ప్రతీ ఒక్కరికి సారీ చెపుతున్నా. ఇలాంటి తప్పును మరోసారి చేయను. ఈ ఘటనకు సంబంధించి నా మిత్రులు, సన్నిహితులకు క్షమాపణ చెప్పాను అని మీడియాకు ప్రథమ్ తెలిపాడు. తాను ఇంతటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాలను వివరించాడు.

  ఒత్తిడికి గురయ్యా

  ఒత్తిడికి గురయ్యా

  కొన్ని కారణాల వల్ల చాలా మానసిక క్షోభకు గురయ్యాను. కొందరు తనపై అసత్య ఆరోపణలు చేయడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కొన్ని పనులు చేస్తున్నాను. బిగ్ బాస్‌లో గెలిచిన పారితోషికం మొత్తాన్ని పేదలకు పంచి పెట్టాలని అనుకొన్నాను. ఇక దానిపై దృష్టిపెడుతాను అని ప్రథమ్ చెప్పాడు.

  మంచి సంకేతాలు వెళ్లవు..

  మంచి సంకేతాలు వెళ్లవు..

  నాలాంటి సెలబ్రీటి సోషల్ మీడియాలో లైవ్ ద్వారా సూసైడ్‌కు ప్రయత్నించడం వల్ల సమాజానికి మంచి సంకేతాలు వెళ్లవని తెలుసుకొన్నాను. నా జీవితంలో చోటుచేసుకున్న ఘటనలపై చింతిస్తున్నానని పేర్కొన్నాడు. ఇక నా జీవితంలో చేదు ఘటనగా మారిన ఆ ఉదంతంపై ఇక మాట్లాడను. అలాంటి పిచ్చి పనిని తాను చేయాల్సి ఉండేది కాదు అని ప్రథమ్ అన్నాడు.

  ఇక సినిమాలపై దృష్టిపెడుతా..

  ఇక సినిమాలపై దృష్టిపెడుతా..

  సూసైడ్ ఎపిసోడ్ నుంచి బయటపడిన ప్రథమ్ ప్రస్తుతం దేవరంతా మనుష్య అనే చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. పునర్జన్మ ఎత్తిన నేను ఇక జీవితంలో మంచి విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తాను. ప్రస్తుతం నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ‘దేవ్రవ్నే బుదు గురు' అనే సినిమా పూర్తి కావొస్తున్నది అని ప్రథమ్ వెల్లడించాడు.

  సంజన‌తో టెలివిజన్ షోతో

  సంజన‌తో టెలివిజన్ షోతో

  బిగ్‌బాస్‌లో సహచరి సంజనాతో ఓ వీకెండ్ షోను ప్రథమ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కార్యక్రమం పూర్తిగా వినోదాత్మకమైంది. ప్రేక్షకులు బాగా ఆనందించడం ఖాయం. ఈ కార్యక్రమం పేరు సంజూ మథు నాను అని చెప్పాడు. వారాంతంలో ఈ కార్యక్రమం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని ప్రథమ్ ధీమా వ్యక్తం చేశాడు.

  ఫేస్‌బుక్‌లో లైవ్.. సూసైడ్ అటెంప్ట్

  ఫేస్‌బుక్‌లో లైవ్.. సూసైడ్ అటెంప్ట్

  ఏప్రిల్ 4 తదీన ప్రథమ్ ఫేస్ఋక్‌ లైవ్ దాదాపు 20 నిమిషాలపాటు సాగింది. లైవ్‌లో ప్రథమ్ మాట్లాడుతూ.. ‘చాలా మందిని మోసం చేశాను అని రూమర్లు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అసలు విషయం తెలుసుకోకుండా ఈ సమాజం కూడా ఓ నిర్ణయానికి రావడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో ముగియడానికి కొన్ని క్షణాల ముందు నిద్రమాత్రలు మింగడానికి ప్రయత్నించడం స్పష్టంగా కనిపించిన సంగతి తెలిసిందే.

  స్నేహితుడు లోకేశ్‌పై..

  స్నేహితుడు లోకేశ్‌పై..

  ఫేస్‌బుక్ లైవ్‌లో తన స్నేహితుడు లోకేశ్‌పై ప్రథమ్ ఆరోపణలు చేశాడు. లోకేశ్ వేధింపులతో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆయన టార్చర్‌ను భరించలేకపోయాను. కన్నడ బిగ్‌బాస్ ప్రొగ్రాంలో గెలిచిన మొత్తం ఇంకా చేతికి అందలేదు. అయితే ఆ మొత్తాన్ని అందరికీ ఎప్పుడు పంచుతావు అని టార్చర్ చేస్తున్నారు. అయితే నాకు లభించిన మొత్తాన్ని నేను పేదలకు పంచాలనుకొన్నాను. ఈ వ్యవహారంలో మీడియా నాపై తప్పుడు వార్తలు ప్రచురించింది అని ప్రథమ్ పేర్కొన్నాడు.

  English summary
  Director-actor and Bigg Boss Kannada winner Pratham made news last week when he attempted to commit suicide in a Facebook Live video. On Sunday Pratham discharged from KIMS hospital, spoke to us in the afternoon, and said that he was embarrassed about his act. "I apologize to everyone. I won't repeat this mistake again. I have already personally apologized to all my near-and-dear ones," he says.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more