For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రత్యూషపై మూడుసార్లు రేప్.. అప్పుడు అమ్మా అని ఎన్నిసార్లు ఏడ్చిందో.. తల్లి సరోజిని

  By Rajababu
  |

  పదిహేనేళ్ల క్రితం అప్పుడప్పుడే సినీతారగా ఎదుగుతున్న ప్రత్యూష అనూహ్యంగా మరణానికి గురైంది. ఆమె మరణంపై అప్పుడు ఎన్నో అనుమానాలు, సందేహాలు వచ్చాయి. తన కూతురుకు జరిగిన అన్యాయంపై తల్లి సరోజిని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రత్యూష తల్లి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడింది. తన కూతురు ప్రత్యూషకు జరిగిన అన్యాయంపై తల్లి సరోజిని చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  Filmibeat Top 10 ఫిల్మీ బీట్ టాప్ 10
  15 ఏళ్లుగా పోరాటం

  15 ఏళ్లుగా పోరాటం

  నా కూతురు చనిపోయి 15 ఏళ్లు గడిచాయి. ఇంకా పోరాటం చేస్తున్నాను. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాను. పిటిషన్ బెంచ్ మీదకు వస్తే వాదనలు ప్రారంభమవుతాయి. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మాట్లాడాలో లేదో తెలియదు. కానీ న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం పోయింది. ఎందుకంటే కూతురు చనిపోయిన తల్లికి న్యాయం జరుగలేదు. ఏ తల్లికి న్యాయం జరగడం లేదు.

  చట్టాలపై నమ్మకం లేదు

  చట్టాలపై నమ్మకం లేదు

  ప్రత్యూష కేసులో హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఇంకా చట్టాలపై నమ్మకం పోయింది. గతంలో విధించిన శిక్షను కూడా తగ్గించారు. సెషన్స్ కోర్టులో ఏడున్నర సంవత్సరాలు శిక్ష విధిస్తే దానిని హైకోర్టులో రెండున్నర ఏళ్లకు తగ్గించారు.

  ప్రత్యూషకు అన్యాయం

  ప్రత్యూషకు అన్యాయం

  ప్రత్యూషకు అన్యాయం జరిగిందనే అందరికీ తెలుసు. అందుకే నేను ప్రత్యూష కేసును సుప్రీంకోర్టుకు తీసుకెళ్లాను. దేశ అత్యున్నత కోర్టులో న్యాయం జరుగుతుందనే భరోసాతో ఉన్నాను. ఏ అత్యాచారం కేసులోనైనా పోస్ట్ మార్టం రిపోర్టును పరిగణనలోకి తీసుకొంటారు. కానీ ప్రత్యూష కేసులో అది జరగలేదు. జస్టిస్ మునిస్వామి రిపోర్టును లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇది న్యాయామేనా?

  బెదిరింపు కాల్స్ వచ్చాయి.

  బెదిరింపు కాల్స్ వచ్చాయి.

  ప్రత్యూష మరణం తర్వాత నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో డీజీపీకి ఫిర్యాదు చేయగా నాకు సెక్యూరిటీ ఇచ్చారు. ఒకరిని చంపిన తర్వాత వాళ్లు కూడా ఏదో ఒకరోజు ప్రత్యూష కాళ్ల వద్దకు వెళ్తారు కదా. నన్ను కూడా చ

  నా బిడ్డను కాటికి పంపుకొన్నాను..

  నా బిడ్డను కాటికి పంపుకొన్నాను..

  ముక్కు పచ్చలారని 19 ఏళ్ల అమ్మాయిని,పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన ప్రత్యూషను కాటికి పంపుకొన్నాను. కడుపు కాలిన తల్లిని నా బాధను ఎవరికి చెప్పుకోవాలి. నా కూతురును పెంచడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కూతురు లేదన్న బాధ నుంచి పోరాడే శక్తి వస్తున్నది.

  మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులు

  మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులు

  ప్రత్యూష హత్య తర్వాత చాలా పేపర్లలో వచ్చిన ప్రకారం.. ఈ దారుణంలో తెలుగుదేశం పార్టీ మినిస్టర్ల కొడుకులు, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు, సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు అని తెలిసింది. అయితే వారే అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. హత్యా సంఘటన నుంచి సాక్ష్యాలను తారుమారు చేశారు.

  కారులో మూడుసార్లు రేప్ చేశారు..

  కారులో మూడుసార్లు రేప్ చేశారు..

  ఓ ప్రముఖ చానెల్‌లో ప్రైవేటుగా ఆఫ్ ది రికార్డుగా చేసిన దర్యాప్తు ప్రకారం.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో మొదట రేప్ చేశారు. కారులో హిమాయత్ నగర్ నుంచి కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చే వరకు మూడుసార్లు రేప్ చేశారు. చివరకు ప్రత్యూష నోటిలో విషం పోశారు. సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష ఆత్మహత్య చేసుకొన్నారని నిరూపించడానికి సిద్ధార్థ్ రెడ్డి మూతి వద్ద కొంత విషం పూశారు.

  అమ్మా అని ఎన్నిసార్లు అరిచిందో

  అమ్మా అని ఎన్నిసార్లు అరిచిందో

  కారు అద్దాలు ఎక్కించి రేప్ చేసే సమయంలో నా కూతురు ఎన్నిసార్లు అమ్మా అని అరిచిందో. ఎంత వేధన పడిందో అనే విషయం ఆలోచిస్తేనే గుండె తరుక్కు పోతుంది. విషం పోసేటప్పుడు నోరు తెరువలేదో ఏమో.. గొంతు నొక్కడంతో మెడ మీద గాయాలు అయ్యాయి. ఇదేం అని వైద్యులను అడిగితే వైద్యం చేసేటప్పుడు పెట్టిన క్లిప్స్ గుర్తులు అని వైద్యుల చెప్పడంపై నేను షాక్ తిన్నాను.

  వాళ్లింట్లో అమ్మాయిలు లేరా

  వాళ్లింట్లో అమ్మాయిలు లేరా

  ప్రత్యూషపై దారుణానికి పాల్పడిన వారి ఇంట్లో అమ్మాయిలు లేరా? వాళ్లింట్లో మహిళలు లేరా? ఈ కేసులో ఎక్కడ తప్పించుకొన్నా వారికి దేవుడి వద్ద శిక్షపడుతుంది. ప్రత్యూష గురించి గుర్తువస్తే గుండె భారంగా మారిపోతుంది. ఇప్పటికి ప్రత్యూష సినిమా వస్తే టెలివిజన్ ఆఫ్ చేస్తాం.

  15 ఏళ్ల నుంచి నా కొడుకు..

  15 ఏళ్ల నుంచి నా కొడుకు..

  ప్రత్యూష చనిపోయేవరకు నా కుమారుడు ఇప్పటికి అంటే 15 ఏళ్ల నుంచి పతంగి ఎక్కించలేదు. దీపావళీకి టపాసులు కాల్చలేదు. ప్రత్యూష మరణం ఇప్పటికీ మమల్నీ వెంటాడుతున్నది. వాళ్లేమో చాలా హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.

  డబ్బు, అధికారంతో అహం

  డబ్బు, అధికారంతో అహం

  డబ్బు, అధికారంతో ఏదైనా చేయవచ్చు అనే అహంతో ఏదైనా చేయవచ్చు అనే ధైర్యం వాళ్లకు ఉంది. అందుకే ప్రత్యూషపై దారుణానికి పాల్పడ్డారు. వాళ్ల ఆడపిల్లలకు అయితే ఆ బాధ ఏంటో వారికి తెలిసేది. డబ్బు, అధికారం చేతిలో ఉంటే పిల్లలు ఎంత దారుణంగా తయారవుతారో అనడానికి ఇది ఓ ఉదాహరణ.

  English summary
  Actress Prathyusha death become sensational in the media. Her death becomes mystery even today. Her mother Sarojini fighting for justice since 15 years. In this occassion, She interviewd to one youtube Channel recently. In that occassion, She said, Her daughter raped thirce in moving cars.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X