»   »  మెగాభిమానుల చర్చ దీని గురించే,ఇప్పుడే ఇలా ఉంటే, ఇంక...

మెగాభిమానుల చర్చ దీని గురించే,ఇప్పుడే ఇలా ఉంటే, ఇంక...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొత్తానికి మెగా అభిమానులంతా ఇప్పుడు ఓ డిస్కషన్ లో మునిగిపోయారు. అదేమింటే...తమ ఆరాధ్యదైవం మెగా స్టార్ చిరంజీవి ప్రీ లుక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ ని 150వ సినిమా టైటిల్‌తో పాటే ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఫస్ట్ లుక్ ని ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి. ఏ స్దాయిలో దాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయమీదే దృష్టి పెడుతున్నారు. ఫస్ట్‌లుక్ చెప్పిన తేదీకే పక్కాగా వచ్చేస్తుందని తెలుపుతూ, చరణ్, నిన్న సాయంత్రం ఓ ప్రీ లుక్‌ను కూడా విడుదల చేయటం వారిని ఆనందంలో ముంచెత్తుతోంది.


అంతేకాకుండా.. చిరు పుట్టినరోజును భారీగా సెలబ్రేట్ చేస్తూ..,ఫస్ట్‌లుక్ విడుదలకు భారీ క్రేజ్ తెచ్చేలా రామ్ చరణ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. అందులో పాలు పంచుకుని తమ మెగాభిమానాన్ని అదిరిపోయే స్దాయిలో చాటాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెగా అభిమాన సంఘాలు సైతం ఎలర్ట్ గా ఉన్నాయి.
 Pre Look Poster: Chiru 150 Theme Revealed

ఇక తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా ప్రకటన వచ్చిన రోజునుంచే ఎక్సపెక్టేషన్స్ మొదలైపోయాయి.సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా రైతుల సమస్యలు, వారి భూములను కార్పోరేట్ సంస్థలు ఎలా చేజక్కించుకుంటున్నాయి? వాటిపై హీరో ఎలా పోరాడాడు అన్న అంశాలపై సినిమా నడుస్తూ ఉంటుంది.

దాదాపు 9 ఏళ్ళ తర్వాత చిరంజీవి చేస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మధ్యన మొదలైన ఈ చిత్ర షూటింగ్ తాజాగా చంచల్ గూడకి లో జరుపుకుంది. అక్కడ జైలులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

వివి వినాయక్ తన దైన స్టైల్‌లో చిత్రీకరించే సన్నివేశాలు ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో మేజర్ షెడ్యూల్‌ని చిత్రీకరించనున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బాణీలను కూర్చే పనిలో బిజీ అయ్యాడు.

English summary
First look poster of megastar Chiranjeevi's 150th film coming out on the legendary actor's birthday, on 22nd August, a pre-look poster has been released now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu