»   » పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇపుడు కొడుకుతో....(ఫోటో)

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇపుడు కొడుకుతో....(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది బాలీవుడ్ బ్యూటీ ప్రీతి ఝంగియానీ. అయితే ఆ సినిమాలో మాత్రం ఆమె పేరును ప్రీతి జింగానియాగా వేసారు. మళయాలం మూవీ ‘మఝావిల్లు' హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన ప్రీతి... తమ్ముడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

తమ్ముడు సినిమా తర్వాత బాలయ్యతో ‘నరసింహ నాయుడు', మెహన్ బాబుతో ‘అధిపతి', అప్పారావు డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే, యమదొంగ సినిమాలో ఊర్విసిగా గెస్ట్ రోల్, విశాఖ ఎక్స్ ప్రెస్, తర్వాత ‘తేజం' అనే మరో సినిమాలో నటించింది. అయితే ‘తమ్ముడు' సినిమాకు వచ్చినంత గుర్తింపు ఆమెకు ఏ సినిమాకూ రాలేదని చెప్పొచ్చు.

Preeti Jhangiani spotted with Son!

సౌత్ సినిమాల కంటే బాలీవుడ్ సినిమాల్లోనే ప్రీతి ఎక్కువగా నటించింది. 2008లో పర్విన్ దబ్బాస్‌ను పెళ్లాడిన ఆమె తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. 2011లో ఏప్రిల్ 11న కొడుకు జన్మించాడు. ఆ తర్వాత కూడా 2013 వరకు వివిధ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కొడుకు పెంపకంపైనే ఎక్కువ దృష్టి సారించింది. తాజాగా కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేసింది.

English summary
Actress Preeti Jhangiani was spotted with her son Jaivesh recently and they happily posed for a photograph. The Senior Heroine shares her son loves watching Animation & Disney movies.
Please Wait while comments are loading...